యాక్ష‌న్ సీన్స్‌లో హ‌లో గురు ప్రేమ కోస‌మే

Hello Guru Prema Kosame Shoot Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Hello Guru Prema Kosame Movie Updates,Hello Guru Prema Kosame Telugu Movie Latest News,Ram Pothineni Hello Guru Prema Kosame Movie News,Hero Ram Pothineni Hello Guru Prema Kosame Telugu Movie Latest Updates
Hello Guru Prema Kosame Shoot Updates

యువ క‌థానాయ‌కుడు రామ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత క‌థానాయిక‌లు. ‘సినిమా చూపిస్త మావ‌’, ‘నేను లోక‌ల్’ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌ను అందుకున్న త్రినాథ‌రావు న‌క్కిన ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప‌తాక స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. రామ్‌, ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణం పాల్గొన‌గా.. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, ఆమ‌ని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here