అర‌వింద స‌మేత‌.. క్లైమాక్స్‌లో మార్పులు?

Aravindha Sametha climax changes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Aravindha Sametha Movie Updates,Aravindha Sametha Telugu Movie Latest News,Aravindha Sametha Movie Climax Changed,Aravindha Sametha Telugu Movie Climax Changed
Aravindha Sametha climax changes?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌’. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాని హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. త్రివిక్ర‌మ్ త‌న శైలికి త‌గ్గ‌ట్టు.. ఎమోష‌న‌ల్ సీన్స్‌తోనే క్లైమాక్స్ ప్లాన్ చేస్తే.. ఎన్టీఆర్ మాత్రం కాస్త యాక్ష‌న్ డోస్ ఉన్న సీన్స్‌తో చేస్తే బాగుంటుంద‌ని సూచ‌న ఇచ్చార‌ట‌. ఆ దిశ‌గానే ఇప్పుడు త్రివిక్ర‌మ్ క్లైమాక్స్ ప్లాన్ చేశార‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

కాగా.. విజ‌య ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here