వైఎస్సార్ బయోపిక్ మూవీ నేడే షూటింగ్ ప్రారంభం

వైఎస్సార్ బయోపిక్ మూవీ నేడే షూటింగ్ ప్రారంభం,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,YSR Biopic Yatra Movie Shooting Begins,Yatra Movie Updates,Yatra Telugu Movie Latest News,Yatra Movie Shooting Updates,Yatra Telugu Movie Shooting Latest News
YSR Biopic Yatra Movie Shooting Begins

దివంగత ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమా 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మహి వి రాఘవ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా రూపొందనున్న విషయం తెలిసిందే. చాలా సంవత్సరాల తరువాత మమ్ముట్టి తెలుగు లో నటించనున్న సినిమా యాత్ర. బాడీ లాంగ్వేజ్ తో పాటు పూర్తి డెడికేషన్ తో మమ్ముట్టి, వై ఎస్ రాజశేఖర రెడ్డి కేరక్టర్ పోషించనున్నారు.

యాత్ర సినిమా షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. జూన్ 20 వ తేదీ నుండి సెప్టెంబర్ నెల వరకు ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ జరుపుకోనుంది. కడప దాటి వస్తున్నా మీ గడప కష్టాలు వినడానికి అనే స్లోగన్ తో వైఎస్ పాదయాత్ర ప్రారంభించారు. అదే విధంగా యాత్ర సినిమా ను లాంగ్ షెడ్యూల్ లో రూపొందిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో యాత్ర సినిమా సుదీర్ఘ షెడ్యూల్ లో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం గా నిలుస్తుంది. డైరెక్టర్ మహి వి రాఘవ మాట్లాడుతూ … వై ఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ కు తగ్గకుండా ఈ బయోపిక్ మూవీ ఉంటుందని,ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తామని తెలిపారు. యాత్ర బయోపిక్ మూవీ కి విజయ్ చిల్లా,శశిదేవి రెడ్డి నిర్మాతలు. సినిమా యూనిట్ రిలీజ్ చేసినయాత్ర సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here