ర‌జ‌నీకాంత్‌తో మురుగ‌దాస్ చిత్రం?

AR Murugadoss Next Team up with Rajinikanth, Latest Telugu Movies News, Rajinikanth Next Movie with AR Murugadoss?, Rajinikanth Next Movie with Director AR Murugadoss, Rajinikanth Upcoming Movie, Super Star Rajinikanth Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, ర‌జ‌నీకాంత్‌తో మురుగ‌దాస్ చిత్రం?

కొంత‌కాలం క్రితం రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. మ‌రోవైపు వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇటీవ‌లే ‘కాలా’తో ప‌ల‌క‌రించిన ర‌జ‌నీ.. ఆ సినిమా విడుద‌లైన రోజునే కొత్త సినిమాకి శ్రీ‌కారం చుట్టారు. కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుదల కానుందని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో చిత్రానికి కూడా ర‌జ‌నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. టాప్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ఇటీవ‌ల రజ‌నీకాంత్‌ను సంప్ర‌దించి.. ఇంత‌కు ముందు ర‌జ‌నీ రిజెక్ట్ చేసిన క‌థ‌నే మార్పు చేర్పులు చేసి వినిపించార‌ట‌. అది బాగా న‌చ్చ‌డంతో ర‌జ‌నీ కూడా ప‌చ్చ జెండా ఊపేశార‌ని కోడంబాక్కం వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాకుండా.. ఈ ఏడాది చివ‌రిలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ర‌జనీ, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన ‘2.0’ ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here