ఆ వార్త‌ల్లో నిజం లేదంటున్న రాజ్ త‌రుణ్‌

Actor Raj Tarun Latest News, Fake News About Raj Tarun Next Movie Remake, Latest Telugu Movies News, Raj Tarun About Naanum Rowdy Dhaan, Raj Tarun Confirmed Next Remake, Raj Tarun Refutes Remake Rumours, Raj Tarun Upcoming Movies, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, ఆ వార్త‌ల్లో నిజం లేదంటున్న రాజ్ త‌రుణ్‌

త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’. విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన ఈ సినిమాకి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. తెలుగులో ఈ చిత్రం ‘నేనూ రౌడీనే’ పేరుతో అనువాద‌మ‌య్యింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌రంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌బోతున్నరని.. ఇందులో హీరోహీరోయిన్లుగా రాజ్ త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ న‌టించ‌బోతున్నార‌న్న‌దే ఆ వార్త‌ల సారాంశం. అయితే.. దీనిపై రాజ్ త‌రుణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని.. ప్ర‌స్తుతం త‌ను ఆ సినిమా రీమేక్ చేయ‌డం లేద‌ని రాజ్ త‌రుణ్ పేర్కొన్నారు. అలాగే త‌న త‌దుప‌రి చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంద‌ని.. దీనికి సంబంధించి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఇంకా ఫైన‌లైజ్ కాలేద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు.

ఇదిలా ఉంటే.. దిల్ రాజు నిర్మాణంలో రాజ్ త‌రుణ్ న‌టించిన ‘ల‌వర్’ చిత్రం జూలైలో తెర‌పైకి రానుంది. ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ ఈ సినిమాని రూపొందించారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here