నా నువ్వే మూవీ రివ్యూ

Naa Nuvve Movie Review,Telugu Filmnagar,Telugu Movies News,Telugu FIlm News 2018,Tollywood Cinema Updates,Latest Telugu Movies Reviews,Naa Nuvve Telugu Movie Review,Naa Nuvve Review,Naa Nuvve Movie Rating,Kalyan Ram Naa Nuvve Movie Review,Naa Nuvve Telugu Movie Rating,Naa Nuvve Movie Public Talk,Naa Nuvve Live Updates,Naa Nuvve Movie Latest News,Kalyan Ram Naa Nuvve Movie Review and Rating
Naa Nuvve Review

చిత్రం: నా నువ్వే

నటీనటులు: కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, సురేఖా వాణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి, ప్రవీణ్, ఎల్.బి.శ్రీరామ్, బిత్తిరి స‌త్తి తదితరులు

ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్

కూర్పు: స‌తీష్ సూర్య‌

సంగీతం: షెరత్

నిర్మాణ సంస్థ: కూల్ బ్రీజ్ సినిమాస్

నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటి

కథ: జయేంద్ర పంచపకేశన్, శుభ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జయేంద్ర

విడుదల తేది: 14 జూన్ 2018

ప్రేమ‌క‌థ‌ల‌తో ఎన్ని చిత్రాలు వ‌చ్చినా.. కొత్త‌గా మ‌రో సినిమా అదే నేప‌థ్యంతో వ‌స్తుందంటే ఎక్క‌డ లేని ఆస‌క్తి వ‌చ్చేస్తుంది. అదే.. ప్రేమ‌కున్న బ‌లం. అందుకే.. తెలుగు తెర‌పై ఎన్నో ప్రేమ‌క‌థా చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పించాయి. మురిపించాయి. ఒక్కో ప్రేమ‌క‌థ‌ది ఒక్కో నేప‌థ్యం. అలా.. విధిని నేప‌థ్యంగా చేసుకుని తెర‌కెక్కిన ప్రేమ‌క‌థా చిత్రం ‘నా నువ్వే’. క‌ళ్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని జ‌యేంద్ర తెర‌కెక్కించారు. గురువారం తెర‌పైకి వ‌చ్చిన ఈ సినిమాపై ‘తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌. కామ్’ అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థాంశం

విధి(డెస్టినీ)ని బాగా న‌మ్మే ఓ అమ్మాయి జీవితంలోకి.. దాన్ని అస్స‌లు న‌మ్మ‌ని ఓ అబ్బాయి ప్ర‌వేశిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్రం ‘నా నువ్వే’. మీరా (త‌మ‌న్నా)కి విధిపై న‌మ్మ‌కం ఎక్క‌వ‌. అలాంటి అమ్మాయికి.. ‘ల‌వ్ సైన్స్’ (Love Signs) అనే ఓ పుస్త‌కం ఎన్ని సార్లు మిస్ అయినా త‌న చెంత‌కే వ‌చ్చి చేరుతుంటుంది. రైల్వే స్టేష‌న్‌, ఫుట్ పాత్‌పై ఉండే పాత బుక్ స్టాల్‌, బ‌స్ జ‌ర్నీ.. ఇలా అనేక చోట్ల‌ ఆ పుస్త‌కాన్ని మిస్ అయినా.. చివ‌ర‌కు త‌న ఇంటిలో కూడా అది ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. ఆ పుస్త‌కం తెరిచి చూస్తే.. అందులో వ‌రుణ్ (క‌ళ్యాణ్ రామ్‌) ఫొటో క‌నిపిస్తుంది. ఆ ఫొటో చూసిన మ‌రు క్ష‌ణ‌మే.. ఎప్పుడూ ఫెయిల‌య్యే త‌ను పాస‌యిన‌ట్లుగా గుడ్ న్యూస్ వింటుంది. ఆ త‌రువాత మ‌రికొన్ని సంద‌ర్భాల్లోనూ.. త‌ను వ‌రుణ్ ఫొటో చూసినప్పుడ‌ల్లా అనుకున్న ప‌ని నెర‌వేరుతుంటుంది. దీంతో.. వ‌రుణ్‌ను త‌న ల‌క్కీ ఛార్మ్‌గా భావిస్తుంటుంది మీరా. ఇలానే. వ‌రుణ్ కార‌ణంగానే అనుకోకుండా రేడియో జాకీ కూడా అయిపోయి స‌క్సెస్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో.. ఓ సారి అనూహ్యంగా వ‌రుణ్‌ని క‌లిసిన మీరా త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తుంది. అలాగే.. విధి కార‌ణంగానే మ‌నం ఇలా క‌లిశామ‌ని చెబుతుంది. విధిపై అంత‌గా న‌మ్మకం లేని వ‌రుణ్ ఆమె మాట‌ల‌ను తేలిగ్గా తీసుకుంటాడు. అయితే.. ఓ సంఘ‌ట‌న కార‌ణంగా అత‌ని విదేశ ప్ర‌యాణం ఆగిపోవ‌డంతో.. మీరాని తిరిగి క‌లుస్తాడు. కొన్ని సంఘ‌ట‌న‌ల త‌రువాత ‘ఏ విధి మ‌న‌ల్ని క‌లిపింద‌ని నువ్వు భావిస్తున్నావో.. ఆ విధి విష‌యంలో ఓ చిన్న ప‌రీక్ష పెడ‌తాను’ అంటాడు వ‌రుణ్‌. ఇంత‌కీ మీరాకి వ‌రుణ్ పెట్టిన ఆ ‘విధి ప‌రీక్ష’ ఏమిటి? ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అనేదే ‘నా నువ్వే’ చిత్రం.

విశ్లేష‌ణ‌

విధి ఓ జంట విష‌యంలో ఎలా దోబూచులాడింది? అనే సింపుల్ పాయింట్‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. విధిని న‌మ్మే క‌థానాయిక‌.. న‌మ్మ‌ని క‌థానాయ‌కుడు.. ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌.. ఇలా ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్నే ఎంచుకున్న ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర‌.. ఆ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల‌ను బాగానే టేకాఫ్ చేసినా.. వాటిని మ‌రింత ప‌క‌డ్బందీగా త‌యారు చేసుకోవ‌డంలో శ్ర‌ద్ధ పెట్టుంటే బాగుండేది. ముఖ్యంగా.. వాలైంటెన్స్ డే సంద‌ర్భంగా మీరా 36 గంట‌ల‌పాటు న‌డిపే నాన్ స్టాప్ షో పూర్త‌య్యే లోపే హీరోహీరోయిన్లు క‌లుస్తారా? లేదా? అనే టైమ్ లాక్ సీన్స్‌ను మ‌రింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దే అవ‌కాశం ఉన్నా.. ద‌ర్శ‌కుడు ఆ వైపు దృష్టి పెట్ట‌లేదు అనిపిస్తుంది. దానికి తోడు స్లో నేరేష‌న్ మ‌రో ప్ర‌తిబంధ‌కంగా మారింది. అయిన‌ప్ప‌టికీ.. క‌ళ్యాణ్ రామ్‌, త‌మ‌న్నా వంటి ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌, పి.సి.శ్రీ‌రామ్ లాంటి ఏస్ కెమెరామేన్ ఛాయాగ్ర‌హ‌ణం, విన‌సొంపైన పాట‌లు తోడ‌వ‌డంతో ఈ ప్రేమ‌క‌థ టార్గెట్ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. వ‌రుణ్ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ ఒదిగిపోయార‌నే చెప్పాలి. ఇప్ప‌టివ‌ర‌కు యాక్ష‌న్ చిత్రాల్లోనే ఎక్కువ‌గా న‌టించిన క‌ళ్యాణ్ రామ్‌.. పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించ‌డం ఇదే తొలిసారి అయిన‌ప్ప‌టికీ.. పాత్ర కోసం మేకోవ‌ర్ అయిన విధానం అభిమానుల‌ను మెప్పిస్తుంది. స‌ర‌దా స‌న్నివేశాల్లోనూ.. రొమాంటిక్ స‌న్నివేశాల్లోనూ క‌ళ్యాణ్ రామ్‌ రాణించారు. ఇక మీరా పాత్ర‌లో త‌మ‌న్నా చాలా అందంగా క‌నిపించింది. పెర్‌ఫార్మెన్స్ ప‌రంగానూ మెప్పించింది. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్‌లో త‌మ‌న్నా అభిన‌యం గుర్తుండిపోతుంది. త‌నికెళ్ళ భ‌ర‌ణి, సురేఖా వాణి, పోసాని, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర మెప్పించారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. షెర‌త్ సంగీతంలో పాట‌ల‌న్నీ బాగున్నాయి. ముఖ్యంగా ‘చినికి చినికి’, ‘హేయ్ హేయ్‌’, ‘నిజ‌మా మ‌న‌సా’, ‘ప్రేమికా’ పాట‌లు విన‌డానికి, చూడ‌డానికి బాగున్నాయి. నేప‌థ్య సంగీతం ఆహ్లాద‌క‌రంగా సాగింది. పి.సి.శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం కంటికింపుగా ఉంది. ముఖ్యంగా పాట‌ల్లో ఆయ‌న కెమెరా ప‌నిత‌నం మ‌రోసారి ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్న‌ప్ప‌టికీ.. సెకండాఫ్‌లో స‌న్నివేశాల పొందిక స‌రిగ్గా లేద‌నిపిస్తుంది. మాట‌ల్లో “గ్యారంటీ అనేది అమ్మకానికి ఉంటుంది.. నమ్మకానికి కాదు” వంటి డైలాగులు బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్
తమన్నా
సంగీతం
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువ‌లు

మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
స్క్రీన్ ప్లే
సెకండాఫ్‌
డైరెక్ష‌న్‌

చివ‌ర‌గా.. డీసెంట్ ల‌వ్ స్టోరీ.. ‘నా నువ్వే’

నా నువ్వే మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performances
2.8
Sending
User Review
0 (0 votes)

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here