తేజ్ ఐ ల‌వ్ యు.. ఓ మెగా సెంటిమెంట్‌

Mega Sentiment For Sai Dharam Tej,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Mega Sentiment For Sai Dharam Tej Tej I Love You Movie,Tej I Love You Movie Latest News,Sai Dharam Tej Next Upcoming Movie,Mega Sentiment For Tej I Love You Movie,తేజ్ ఐ ల‌వ్ యు.. ఓ మెగా సెంటిమెంట్‌
Mega Sentiment For Sai Dharam Tej

‘ప‌సివాడి ప్రాణం’, ‘తొలి ప్రేమ‌’, ‘ఇంద్ర‌’, ‘మ‌గ‌ధీర‌’, ‘ఫిదా’.. ఈ మెగా హీరోల‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌న్నింటికి ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే.. ఈ సినిమాల‌న్నీ కూడా జూలై నెల‌లోనే విడుద‌ల కావ‌డం. యాదృచ్ఛిక‌మో మ‌రొక‌టో తెలియ‌దు కానీ.. ఇప్పుడు ఇదే జూలై నెల‌లో మ‌రో మెగా హీరో సంద‌డి చేయ‌బోతున్నారు. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఇప్ప‌టివ‌ర‌కు జూలై నెల‌లో త‌న సినిమాల‌తో ప‌ల‌క‌రించని సాయిధ‌ర‌మ్‌.. త‌న కొత్త చిత్రం ‘తేజ్ ఐ ల‌వ్ యు’తో ఇదే నెల‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. వాస్త‌వానికి ఈ సినిమాని జూన్ 29న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే.. తాజాగా జూలై 6న త‌మ చిత్రం విడుద‌ల కాబోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌ ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించింది. మ‌రి.. మెగాహీరోల‌కి క‌లిసొచ్చిన జూలై సెంటిమెంట్‌.. ‘సుప్రీమ్’ త‌రువాత సాలిడ్ హిట్ లేని సాయిధ‌ర‌మ్‌కు కూడా వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.
అన్న‌ట్టు.. ఇదే తేదిన మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన తొలి చిత్రం ‘విజేత’ కూడా విడుద‌ల కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here