`శీల‌వ‌తి` అదృష్టానికి, సెన్సార్ వారి `అతి`కి ప‌రాకాష్ఠ‌

Latest Telugu Movies News, Seelavathi Movie Censor Report, Seelavathi Movie Completed Censor Formalities, Seelavathi Movie Stalled by Censor Board, Seelavathi Movie Updates, Seelavathi Telugu Movie Censor Verdict, Seelavathi Telugu Movie Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Seelavathi Movie Stalled by Censor Board

`శీల‌వ‌తి` అనే టైటిల్‌లో బూతు ఏమైనా ఉందా.. అని దారిన‌పోయేవారినెవ‌రినైనా అడిగితే.. ఠ‌క్కున అందులో బూతేముంది? అనే ఆశ్చ‌ర్యార్థ‌క‌మైన స‌మాధానం వ‌స్తుంది. నిజంగానే అందులో బూతు ఏమీ లేదు. మ‌రెందుకు సెన్సార్ వాళ్ళు `శీల‌వ‌తి`చిత్రాన్ని సెన్సార్ చేయ‌టానికి కూడా నిరాక‌రించారు అన్న‌ది ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక చ‌ర్చ‌నీయాంశం అయింది. టీవీ ఛాన‌ళ్ళు దీని మీద డిబేట్లు, డిస్క‌ష‌న్స్ మొద‌లుపెట్టాయి. అస‌లు ఒక సినిమాను చూసిన త‌రువాత దాంట్లో అస‌భ్య అశ్లీల‌త‌లు ఉంటే సెన్సార్ త‌న క‌త్తెరకు ప‌దును పెట్ట‌వ‌చ్చు. కానీ అలాంటిదేమీ లేకుండా టైటిల్ మార్చి తెస్తేనే మీ సినిమా చూస్తాం.. లేదంటే సెన్సార్ కూడా చెయ్యం అని వాళ్ళ అప్లికేష‌న్‌ను రిజ‌క్ట్ చేయ‌టంతో స‌ద‌రు నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.

కాగా.. ఈ సినిమాలో `శీల‌వ‌తి` టైటిల్ రోల్ పోషించిన శృంగార తార ష‌కీలా అస‌లేం జ‌రుగుతుందో నాకు తెలియాలి అని గాండ్రిస్తుంది. “ఇది నా 250వ సినిమా. ఆ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ప‌బ్లిసిటీ చేసాం. 250 అనేది ఒక ల్యాండ్ మార్క్ ఫిగ‌ర్‌. నా సినిమాకు `శీల‌వ‌తి` అనే టైటిల్ పెట్ట‌కూడ‌దా? అస‌లు ఆ టైటిల్ ఎందుకు పెట్టాము.. ఆ టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి? అనేది సినిమా చూస్తే క‌దా అర్థ‌మ‌య్యేది. అస‌లు సినిమాయే చూడ‌కుండా నా సినిమాను రిజ‌క్ట్ చేయ‌డం అన్యాయం. కాబ‌ట్టి సెన్సార్ వాళ్లు ద‌య చేసి మా సినిమాను సెన్సార్ చెయ్యండి అంటూ ప్రాధేయ పూర్వ‌కంగానే డిమాండ్ చేసారు ష‌కీలా. ఈ చిత్ర నిర్మాత‌లు గ‌ణేష్‌, వీరూ పోశెంటిశెట్టి, ద‌ర్శ‌కుడు సాయిరామ్ దాస‌రి కూడా ఇది అన్యాయ‌మంటూ మీడియాకు మొర‌పెట్టుకుంటున్నారు. వెంట‌నే స్పందించిన మీడియా `శీల‌వ‌తి` ప‌క్షం వ‌హించి చ‌ర్చా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతో అయాచితంగా ల‌క్ష‌ల ఫ్రీ ప‌బ్లిసిటీ వ‌చ్చేసింది. నిర్మాత‌ల‌కు ఇంత కంటే ఏం కావాలి? ఊరూ పేరు లేని ఒక శృంగార చిత్రం ప‌ట్ల సెన్సార్ వారికి ఎంత జాలి.. ఎంత స‌హృద‌య‌త‌. లేక‌పోతే ఇంత మేలు చేస్తారా చెప్పండి. నిజానికి ఇంత‌కంటే డైరెక్ట్ బూతు, కాంట్ర‌వ‌ర్సి ధ్వ‌నించే టైటిల్స్‌తో గ‌తంలో ఎన్నో సినిమాలు సెన్సార్‌కు వెళ్ళాయి. సినిమా చూసి టైటిల్‌తో స‌హా రీళ్ళ‌కు రీళ్ళు లేపేసిన సంద‌ర్భాలున్నాయి. కానీ సినిమా చూడ‌కుండానే రిజెక్ట్ చేసి.. త‌మ నెత్తిన పాలు పోసిన సెన్సార్ వారి ఋణాన్ని ఎలా తీర్చుకోవాలి అని `శీల‌వ‌తి` నిర్మాత‌లు తెగ మ‌ద‌న ప‌డిపోతున్నార‌ట‌. సో.. `శీల‌వ‌తి` అదృష్టానికి, సెన్సార్ వారి `అతి`కి ప‌రాకాష్ఠ‌గా చెప్పుకోవాలికి ఈ ప్ర‌హ‌స‌నాన్ని.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here