విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జోడీగా సాయిప‌ల్ల‌వి?

Actress Sai Pallavi Team Up with Vijay Devarakonda, Latest Telugu Movies News, Sai Pallavi Next Upcoming Movies, Sai Pallavi Next with Vijay Devarakonda, Sai Pallavi to Act with Vijay Devarakonda?, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijay Devarakonda New Movie With Sai Pallavi, విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జోడీగా సాయిప‌ల్ల‌వి?

‘ఫిదా’, ‘అర్జున్ రెడ్డి’.. గ‌తేడాది నెల రోజుల గ్యాప్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రాల పేర్లివి. ‘ఫిదా’తో సాయిప‌ల్ల‌వి.. ‘అర్జున్ రెడ్డి’తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా.. యూత్‌లో ఈ ఇద్ద‌రికీ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే.. ఈ ఇద్ద‌ర్నీ ఒకే సినిమాలో న‌టింప‌జేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ‘మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు’ వంటి ఫీల్‌గుడ్ ల‌వ్ స్టోరీని రూపొందించిన ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌విని క‌థానాయిక‌గా న‌టింప‌జేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే సాయిప‌ల్ల‌వి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.
ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి.. శ‌ర్వానంద్‌కి జోడీగా ‘ప‌డిప‌డి లేచె మ‌న‌సు’ చేస్తున్నారు. అలాగే త‌మిళంలో సూర్య‌తో ‘ఎన్‌.జి.కె’, ధ‌నుష్‌తో ‘మారి 2’ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు సాయిప‌ల్ల‌వి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here