ప్రభుదేవా కెరీర్ లోనే తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్ర

Actor Prabhu Deva Role In His Upcoming Movie, Latest Telugu Movies News, Prabhu Deva Next Upcoming Movie, Prabhu Deva Plays Cop for First Time, Prabhu Deva Starts Shooting for Cop Film, Prabhu Deva to Play Cop in His Next Movie, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, ప్రభుదేవా కెరీర్ లోనే తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్ర
Prabhu Deva to Play Cop in His Next Movie

ఇండియన్ మైకైల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన నటుడు ప్రభుదేవా. టాలీవుడ్ చిత్రాల్లో తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సౌత్ ఇండియాలోనే కాదు మొత్తం చూసుకున్నా ఒక నృత్య దర్శకుడు హీరోగా, దర్శకుడిగా సక్సెస్ కావడం ఒక్క ప్రభుదేవా విషయంలోనే చూస్తుంటాం. ఉత్తమ నృత్య దర్శకుడిగా రెండు జాతీయ సినీ పురస్కారాలను అందుకున్నాడు. టాలీవుడ్ లో చిరంజీవి మొదలుకుని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ దాకా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన ప్రభుదేవా తన పాతికేళ్ల కెరీర్లో మొదటిసారి హీరోగా నటిస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే … ఏసీ ముగిల్‌ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. ఇది వరకు ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ నటుడు విజయ్‌ హీరోగా రూపొందిన ‘పోకిరి, విల్లు’ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసిన ఏసీ ముగిల్‌ ఇప్పుడు ప్రభుదేవాను డైరెక్ట్‌ చేయడం విశేషం. ఇందులో ప్రభుదేవాకి జోడిగా నివేథా పేతురాజ్‌ నటిస్తున్నారు. నేమిచంద్‌ ఝబాగ్‌ నిర్మిస్తున్నారు. సురేశ్‌ మీనన్, మహేందర్‌ కీలక పాత్రలు చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌భుదేవా కెరీర్‌లో తొలిసారి పోలీస్ పాత్ర చేయ‌నుండ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. మ‌రి ఖాకీ డ్రెస్ ధ‌రించి ప్ర‌భుదేవా ప్రేక్ష‌కుల‌ని ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో వేచిచూడాల్సిందే.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here