సైరాకి హాలీవుడ్ టెక్నీషియ‌న్‌

Hollywood Technician For Sye Raa,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Hollywood Technician For Mega Star Chiranjeevi Sye Raa,Hollywood Technicians for Sye Raa Narasimha Reddy,Hollywood Technician Working for Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy Shooting Updates,సైరాకి హాలీవుడ్ టెక్నీషియ‌న్‌
Hollywood Technician For Sye Raa

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబ‌ర్ 150’ ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా విజ‌యం అందించిన ఉత్సాహంతో.. ప్ర‌స్తుతం త‌న 151వ చిత్రంగా ‘సైరా న‌ర‌సింహా రెడ్డి’ చేస్తున్నారాయ‌న‌. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహా రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి, సుదీప్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన 40 రోజుల‌ భారీ షెడ్యూల్ కోకా పేట్‌లో వేసిన భారీ సెట్‌లో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసింది చిత్ర బృందం. హాలీవుడ్ చిత్రాలు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌’, ‘స్కై ఫాల్’కు స్టంట్ కొరియోగ్ర‌ఫీ అందించిన గ్రెగ్ పావెల్ నేతృత్వంలో ఈ పోరాట దృశ్యాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.

దాదాపు రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ‘సైరా’ వ‌చ్చే ఏడాది వేస‌వికి తెర‌పైకి రానుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here