సూర్య‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి

Gautham Menon Confirms Project With Suriya,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Gautham Menon Confirms Next with Suriya,Gautham Menon and Suriya Sivakumar to Team Up 3rd Time,Actor Suriya Next With Gautham Menon,Suriya Next Upcoming Movies,సూర్య‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి
Gautham Menon Confirms Project with Suriya

‘గ‌జిని’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌. త‌మిళంతో పాటు తెలుగులోనూ త‌న‌కంటూ మార్కెట్‌ను సంపాందించుకున్నారాయ‌న‌. ఓ వైపు కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీస్ చేస్తూనే.. మ‌రో వైపు ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా చేస్తూ.. కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నారు సూర్య‌. ఇదిలా ఉంటే..ప్ర‌స్తుతం సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఎన్‌.జి.కె’ పేరుతో సూర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమా దీపావ‌ళికి విడుద‌ల కానుంది. ఈ లోపే కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే సినిమాని ప‌ట్టాలెక్కించ‌నున్నారు సూర్య‌. అంతేగాకుండా.. ఆ సినిమా పూర్త‌య్యేలోపు ‘గురు’ ఫేమ్ సుధ కొంగ‌ర చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నారు. వీటితో పాటు.. మ‌రో చిత్రానికి కూడా సూర్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.
సూర్య‌తో ‘కాక్క కాక్క’ (‘ఘ‌ర్ష‌ణ’ ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌), ‘సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించిన గౌత‌మ్ మీన‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని.. వ‌చ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశముంద‌ని గౌత‌మ్ చెప్పుకొస్తున్నారు. సూర్య‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి చేస్తున్న ఈ ప్ర‌య‌త్నంతో గౌత‌మ్ హ్యాట్రిక్ విజ‌యం అందుకుంటారేమో చూడాలి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here