మెగా అల్లుడి సినిమా టీజర్ రిలీజ్

Vijetha Teaser Out Now,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,2018 Telugu Movie Teasers,Vijetha Teaser,Vijetha Movie Teaser,Vijetha Official Teaser,Vijetha Movie Updates,Kalyaan Dhev Vijetha Teaser,#VijethaTeaser,#KalyaanDhev,మెగా అల్లుడి సినిమా టీజర్ రిలీజ్
Vijetha Teaser

వారాహి చలన చిత్రం బ్యానర్ పై రాకేష్ శశి దర్శకత్వంలో మెగా స్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా టీజర్ ఈ రోజు ఉదయం రిలీజ్ అయింది. హీరో కళ్యాణ్ దేవ్ సినిమా ఫస్ట్ లుక్ లోను,టీజర్ లోను ఆకట్టుకున్నారు. తండ్రి మాటలు పట్టించుకోకుండా తిరిగే కుమారుడు,తనకు నచ్చినట్టుగానే ఉంటూ విజేత ఎలా అయ్యాడు అనేదే చిత్రకథ. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి పలువురు హీరోలు ఉండగా, విజేత సినిమా ద్వారా సినీ ఫీల్డ్ కు పరిచయమవుతున్న మరొక హీరో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ స్క్రీన్ ప్రెజన్స్ ఎలా ఉంటుందోనని మెగా ఫ్యామిలీ అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. జూలై నెలలో రిలీజ్ కాబోతున్న విజేత సినిమా లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

జూన్ 24వ తేదీ జరుగనున్న విజేత ఆడియో రిలీజ్ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధి. ఆ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అటెండ్ అవుతారని సమాచారం. మెగా స్టార్ చిరంజీవి నటించిన విజేత సినిమా సూపర్ హిట్ అయింది. కళ్యాణ్ దేవ్ హీరో గా పరిచయమవుతున్న సినిమా కు టైటిల్ కావడం తో విజేత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here