శ్రీరెడ్డిపై న్యాచుర‌ల్ స్టార్ నాని పరువు నష్టం దావా…

Actor Nani warns Sri Reddy, Actress Sri Reddy Responds to Nani Legal Notices, Latest Telugu Movies News, Nani Legal Proceedings Against Sri Reddy, Natural Star Nani Latest News, Natural Star Nani Sends Legal Notice Against sri Reddy, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, శ్రీరెడ్డిపై న్యాచుర‌ల్ స్టార్ నాని పరువు నష్టం దావా

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌‌కు వ్యతిరేకంగా ఒక విప్లవాన్నే నడుపుతున్న శ్రీరెడ్డి తన చేష్టలతో న్యాచుర‌ల్ స్టార్ నానికి కోపం తెప్పించింది. మొదట్లో పెద్దగా పట్టించుకోని నాని ఈ వివాదాస్పద నటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సంద‌ర్భంగా శ్రీరెడ్డికి నాని త‌రుపు లాయ‌ర్ల నుంచి లీగ‌ల్ నోటీసులు పంపించ‌డం జ‌రిగింది. అంతేకాకుండా నాపై అస‌త్య‌పు ఆరోప‌ణ‌లుచేస్తూ నా ప‌రువుకు భంగంక‌లిగిస్తున్నార‌ని వాపోయాడు. శ్రీరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నానని, లీగల్ నోటీసులు కూడా పంపానని నాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘నేను స్పందించి ఆ బురదను నాకు అంటించుకోవడంలేదు. వాళ్లు ఏం కోరుకుంటున్నారో అది నేను ఇవ్వడంలేదు. లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను. పరునష్టం దావా వేయడానికి లీగల్ నోటీసులు పంపించాను. ఒకరు కొంత మందిని టార్గెట్ చేస్తూ వాళ్ల పేర్లను ఎంచుకొని నిరాధారమైన పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి వాళ్లకు దీనితో ఎలాంటి సంబంధంలేదు. ఇదే నన్ను డిస్టర్బ్ చేస్తోంది. నేను నా గురించి కలతచెందలేదు. మనం నివసిస్తోన్న ఈ సమాజం గురించి కంగారుపడుతున్నాను. క్లిక్కులు, వ్యూస్ కోసం దీన్ని కొంతమంది పబ్లిష్ చేయడం సిగ్గుచేటు. మీ అందరికీ కుటుంబాలు ఉన్నాయి’ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని నాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజాగా ఈ వివాదంపై నాని భార్య అంజనా సైతం స్పందించారు. ‘‘సినీ పరిశ్రమ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిసిటీ కోసం ఇతరుల జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌టం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవ‌రూ నమ్మరనుకోండి. కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి ఎలా సిద్దప‌డ‌తారో’’ అని అంజ‌నా ట్వీట్ చేశారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here