షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ పంతం’

Gopichand Pantham Movie Shooting Completed,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Pantham Movie Shooting Completed,Pantham Movie Latest News,Pantham Movie Shooting Updates,Gopichand Next Upcoming Movie,Gopichand Pantham Release Date,షూటింగ్ పూర్తి చేసుకున్న పంతం
Gopichand Pantham Movie Shooting Completed

రణం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం లాంటి మంచి హిట్‌లు ఇచ్చిన టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ హీరో గోపిచంద్‌ ప్రస్తుతం ‘పంతం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు గోపిచంద్‌ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ‘పంతం’ చిత్ర యూనిట్ మరియు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషస్ ను తెలియజేశారు . నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పంతం’. ‘ఫర్‌ ఏ కాస్‌’ అన్నది ట్యాగ్ లైన్ . శ్రీసత్య సాయి బ్యానర్‌ పై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. మెహ్రీన్ పిర్జాడా కథానాయిక. గోపీచంద్ 25వ చిత్ర‌మిది. సినిమాకు సంబంధించిన కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు, పాట‌ల‌ను చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ యు.కె కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. దీంతో పంతం సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది.

రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌ కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఒక వైపు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటూనే మంచి మెసేజ్‌ తో సినిమాను రూపొంద‌స్తున్నామ‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించిన‌ట్లే, టీజ‌ర్‌లో శాంపిల్ చూపించారు. ‘‘ఓటును ఐదువేల‌కు అమ్ముకుని అవినీతి లేని స‌మాజం కావాలి. క‌రెప్ష‌న్ లేని కంట్రీ కావాలంటే ఎక్క‌డి నుండి వ‌స్తాయి’’ అని హీరో కోర్టులో వేసే ప్ర‌శ్న‌.. అంద‌రినీ ఆలోచింప‌చేసేదిగా, ఎమోష‌న‌ల్‌గా ఉంది. ఓ వైపు మంచి మెసేజ్‌తో పాటు సినిమాలో ప్రేమ‌, వినోదం వంటి అంశాలు పుష్క‌లంగా ఉండ‌బోతున్న‌ట్లు ట‌జ‌ర్‌ తో శాంపిల్ చూపించారు. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. గోపీచంద్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని క్యారెక్ట‌ర్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు :
గోపీచంద్ , మెహ్రీన్ పిర్జాడా , జయప్రకాశ్ రెడ్డి , పృథ్వీరాజ్ తదితరులు .
సంగీతం : గోపీ సుందర్
కథ , దర్శకత్వం : కె.చక్రవర్తి
నిర్మాత : కె.కె.రాధామోహన్‌
కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల
స్క్రీన్‌ప్లే : కె.చక్రవర్తి, బాబీ
సంభాషణలు : రమేష్‌రెడ్డి

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here