విశ్వ‌రూపం 2 రిలీజ్ డేట్‌

విశ్వ‌రూపం 2 రిలీజ్ డేట్‌,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Vishwaroopam 2 Release Date Locked,Vishwaroopam 2 Movie Updates,Vishwaroopam 2 Telugu Movie Latest News,Kamal Haasan Vishwaroopam 2 Movie News,Kamal Haasan Vishwaroopam 2 Movie Release Date Locked,Vishwaroopam 2 Movie Release Date Confirmed,Vishwaroopam 2 Telugu Movie Release Date Fixed

2013లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన చిత్రం ‘విశ్వ‌రూపం’. క‌మ‌ల్ హాస‌న్‌, ఆండ్రియా, పూజా కుమార్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘విశ్వ‌రూపం 2’ తెర‌కెక్కింది. తొలి భాగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జిబ్రాన్ సంగీత ద‌ర్శ‌కుడు. నిర్మాణం ఎప్పుడో పూర్త‌యిన‌ప్ప‌టికీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల స‌కాలంలో రిలీజ్ కాలేదు ఈ చిత్రం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను ఈ రోజు (సోమ‌వారం) సాయంత్రం 5 గంట‌ల‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే హిందీ వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను అమిర్ ఖాన్‌.. త‌మిళ వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను శ్రుతి హాస‌న్ రిలీజ్ చేయ‌నున్నారు. కాగా.. ఈ సినిమాని ఆగ‌స్టు 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. తొలి భాగంలాగే ఈ సీక్వెల్ కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌న్న‌ ఆశాభావంతో చిత్ర‌యూనిట్ ఉంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here