ద‌స‌రా రేసులో పందెం కోడి 2

ద‌స‌రా రేసులో పందెం కోడి 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Pandem Kodi 2 Latest Updates,Pandem Kodi 2 Movie Updates,Pandem Kodi 2 Telugu Movie Latest News,Pandem Kodi 2 Movie Release Date,Vishal Pandem Kodi 2 Movie News

తెలుగు మూలాలున్న త‌మిళ క‌థానాయ‌కుడు విశాల్‌. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఆయ‌న మంచి మార్కెట్‌ను సంపాదించుకున్నారు. అయితే.. తెలుగునాట‌ విశాల్‌ కంటూ ఓ మార్కెట్ వ‌చ్చింది మాత్రం ‘పందెం కోడి’ చిత్రంతోనే. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఘ‌న‌విజయం సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన లింగుస్వామినే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు కాగా.. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందిస్తున్నారు. ఇక తొలి భాగంలో మీరా జాస్మిన్ క‌థానాయిక‌గా న‌టిస్తే.. రెండో భాగంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తాజాగా విశాల్ ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన ‘అభిమ‌న్యుడు’తో ఘ‌న‌విజ‌యం అందుకున్న విశాల్‌.. పందెం కోడి సీక్వెల్‌తోనూ ఆ స‌క్సెస్‌ను కంటిన్యూ చేస్తారేమో చూడాలి. ఈ సీక్వెల్.. విశాల్ హీరోగా న‌టిస్తున్న 25వ చిత్రం కావ‌డం విశేషం.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here