ఆ విష‌యంలో సుధీర్ బాబు గురించి గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను – సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు

ఆ విష‌యంలో సుధీర్ బాబు గురించి గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను – సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Mahesh Babu About Sudheer Babu At Sammohanam Pre Release Event,Superstar Mahesh Babu About Sudheer Babu At Sammohanam Pre Release Event,Sammohanam Pre Release Event Highlights,Mahesh Babu Speech At Sammohanam Pre Release Event

‘ఆదిత్య 369’, ‘వంశానికొక్క‌డు’, ‘జెంటిల్ మ‌న్’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు శ్రీ‌దేవి మూవీస్ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌. ‘అష్టాచ‌మ్మా’, ‘అంత‌కుముందు ఆ త‌రువాత‌’, ‘జెంటిల్ మ‌న్‌’, ‘అమీ తుమీ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించారు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ‘జెంటిల్ మ‌న్’ వంటి హిట్ మూవీ త‌రువాత వ‌స్తున్న చిత్రం ‘స‌మ్మోహ‌నం’. సుధీర్ బాబు, అదితీరావు హైదరి జంటగా న‌టించిన ఈ చిత్రానికి ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ వివేక్ సాగ‌ర్ సంగీత‌మందించారు. జూన్‌ 15న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్‌స్టార్‌ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ద‌ర్శ‌కులు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, కొరటాల శివ, హరీష్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి, నిర్మాత‌లు కె.అచ్చిరెడ్డి, దిల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. ద‌ర్శ‌కుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ” పాట‌లు, వాటి చిత్రీక‌ర‌ణ‌ చాలా బావున్నాయి. శివలెంక కృష్ణప్రసాద్‌గారు మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ఆయ‌న‌తో ‘ఊయ‌ల’ చేశాను. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కారు. అలాగే సుధీర్‌ బాబు హీరోగా ఆయ‌న ఎంత‌ తపన పడి, చాలా కమిట్‌మెంట్‌తో సినిమాలు చేస్తారు. త‌న సినిమాల‌న్నీ చూశాను. హీరోయిన్‌ గ్లామర్‌గా ఉంది. మంచి సబ్జెక్ట్‌తో.. చాలా న‌మ్మ‌కంతో ఖ‌ర్చుపెట్టి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మనం అందరం గర్వపడి మెచ్చుకునేలా సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నాను” అన్నారు.

కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ ”స‌మ్మోహ‌నం.. టైటిల్‌ జ‌స్టిఫికేష‌న్ 100 శాతం జ‌రిగింద‌నిపిస్తుంది.. ట్రైల‌ర్ చూస్తుంటే. మోహనకృష్ణగారు మరోసారి కొత్తగా ఆలోచించి ‘సమ్మోహనం’ అనే టైటిల్‌ను పెట్టారు. సుధీర్‌బాబు అంకిత భావం ఉన్న న‌టుడు. అత‌ని వెనుక ఉన్న‌ది ఒక స‌మ్మోహ‌న శ‌క్తి.. టాలీవుడ్‌ని సమ్మోహనం చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణగారు. ఆయన తనయుడిగా ప్రిన్స్ మహేష్ బాబు.. సూప‌ర్ స్టార్ అనే ప‌దానికి ఉన్న‌ స్టామినాని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. ఆ ఫ్లేవర్‌ నుండి వచ్చిన సుధీర్‌బాబుగారు కృష్ణప్రసాద్‌గారికి కాసుల వర్షం కురిపిస్తారని భావిస్తున్నాను” అన్నారు.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ ”డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ‌.. ‘గ్రహణం’ సినిమా నుంచి ‘సమ్మోహనం’ వరకు త‌న ఎదుగుద‌ల‌ కంగారు లేకుండా స్థిమితంగా హాయిగా ఉంది. ఇవాళ తెలుగు సినిమా రూటు మారిపోయింది. కొత్త త‌ర‌హా స‌బ్జెక్ట్‌ల‌తో ముందుకు వ‌స్తున్నారు ద‌ర్శ‌కులు. ఇలాంటి తరుణంలో వస్తోన్న ‘సమ్మోహనం’తో ఇందగ్రంటి మోహనకృష్ణ .. ఇంద్రగంటి సమ్మోహనకృష్ణ అవుతాడని భావిస్తున్నాను. సుధీర్‌, అదితి సమ్మోహనంగా ఉన్నారు. నరేష్‌ వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఎ బ్యూటీఫుల్‌ మెమొరీ ఫర్ ఎనీ బ‌డీ” అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ”ఇంద్రగంటి మోహనకృష్ణ అష్టాచెమ్మా, జెంటిల్‌మన్‌ వంటి ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించారు. ఓ సినిమా హీరోయిన్‌ని ఓ సాధారణ కుర్రాడు ప్రేమిస్తే ఏమ‌వుతుంది? అనే కాన్సెప్ట్‌తో ‘సమ్మోహనం’ తీశారు. సినిమా చాలా బావుందని టాక్‌ వినపడుతుంది. డైరెక్టర్‌, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌గారికి, సుధీర్‌బాబు, అదితిరావు హైదరిలకు ఆల్‌ ది బెస్ట్‌. 15న చాలా పాజిటివ్ టాక్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌బోతోంది” అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ”ఇంద్రగంటిగారు ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్కుని క్రియేట్‌ చేసుకున్నారు. ప్ర‌తి టీజ‌ర్‌, సాంగ్‌లో తన మార్క్ ఉంది. సుధీర్‌ నాకు మంచి ఫ్రెండ్‌. నేను డైరెక్టర్‌ కాకముందు నుండి తనతో మంచి పరిచయం ఉంది. సుధీర్.. బ్యాడ్మింట‌న్‌, బిజినెస్‌, ఫిల్మ్స్‌.. ఇలా రంగం ఏదైనా ప్యాషనేట్‌గా చేస్తాడు. తనకు సమ్మోహనం సూపర్‌హిట్‌ మూవీ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది” అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ ”ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన టైటిల్స్‌లో ‘సమ్మోహనం’ ఒక‌టి’. ఒక లవ్‌స్టోరీకి ఇంత కంటే మంచి టైటిల్‌ని పెట్టలేం. ఇంద్రగంటిగారు సెన్సిబుల్‌ డైరెక్టర్‌. ఆయన తీసిన సినిమాలన్నింటిలో ఇది చాలా పెద్ద హిట్‌ అవుతుందని అనుకుంటున్నాను. కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. సుధీర్‌గారేంటో నాకు తెలుసు. చాలా కష్టపడతారు. క‌చ్చితంగా ఆయన కెరీర్‌లోనే ఇది పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. వివేక్‌ సాగర్‌ సంగీతం బావుంది. కృష్ణప్రసాద్‌గారికి ఈ సినిమా పెద్ద సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ ”మనకున్న వన్‌ ఆఫ్‌ ది ఫైనెస్ట్‌ రైటర్‌, డైరెక్టర్స్‌లో మోహనకృష్ణగారు ఒకరు. ఆయన వర్క్‌కి నేను ఫ్యాన్‌ని. ఈ సినిమాలో నేను కూడా భాగమ‌య్యినందుకు ఆనందంగా ఉంది. సుధీర్‌ నాకు ఎప్పటి నుండో పరిచయం. ఆయన ఈ మధ్యనే నిర్మాతగా కూడా మారారు. మంచి ప్యాష‌నేట్‌గా సినిమాలు చేయ‌బోతున్నారు. అదితి మంచి పెర్‌ఫార్మ‌ర్‌. వివేక్‌ సాగర్‌ సంగీతం బావుంది. కృష్ణ ప్ర‌సాద్‌గారు ఐదేళ్ళుగా నాతో సినిమా చేద్దామంటున్నారు. ఇంకా కుద‌ర‌లేదు. ఇక మహేష్ గారి గురించి చెప్పాలంటే.. ఆయన మెర్క్యురీలాంటి యాక్టర్‌. ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తే .. అలా మారిపోతుంటారు. ఎంటైర్‌ టీమ్‌కు అభినందనలు” అన్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ – ”2008లో నేను ఒక రోజు రైలులో వెళుతుంటే ఓ చిన్నపిల్ల ‘పోకిరి’ డైలాగ్స్‌ చెబుతుంది. ఆ ఐడియాతోనే ‘అష్టాచమ్మా’ కథ రాశాను. ఆ సినిమా రాసేటప్పుడు ఓ మ్యాజికల్‌ నేమ్‌ ఉండాలనుకున్న సందర్భంలో.. ఆ చిన్నపిల్ల మహేష్‌ పేరుని నాకు ఐడియాగా ఇచ్చింది. అదే ఏడాది మహేష్‌గారు పెళ్లి కూడా చేసుకున్నారు. ఆయన పేరులో స్టైల్‌, మత్తు, వైబ్రేషన్స్‌ ఉన్నాయి. ఆ సినిమాకు ఆయన పేరు మ్యాజిక్‌ చేసింది. నా సినిమాకు అంత సపోర్ట్‌ చేసిన మహేష్‌గారిని నేను వ్యక్తిగతంగా కలిసి ఎప్పుడూ థాంక్స్‌ చెప్పలేదు. ఇప్పటికీ కుదిరింది… థాంక్స్‌ టు మహేష్‌గారు. ‘సమ్మోహనం’ నా మనసుకి నచ్చి, ఇష్టపడి చేసిన సినిమా. సుధీర్‌ ఈ సినిమా చేసినందుకు తనకు థాంక్స్‌. తను మాత్రమే చేయగల పాత్ర ఇది. క‌ళ‌ను అమితంగా ప్రేమించే పాత్ర‌ను చాలా బాగా చేశారు. అదితి నటనకు నేను ఫ్యాన్‌ అయ్యాను. త‌న‌తో ప‌నిచేయ‌డం ఆహ్లాదంగా అనిపించింది. టెలిఫోనిక్ నేరేష‌న్‌తోనే ఒప్పుకున్నారు. కృష్ణప్రసాద్‌గారు నన్ను నమ్మి సినిమా చేశారు. నరేష్‌గారి రూపంలో మంచి స్నేహితుడు దొరికాడు. వివేక్‌ బ్రిలియంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. తను తన సంగీతంలో ఈ సినిమాను డిఫైన్‌ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు థాంక్స్‌. జూన్‌ 15న సినిమా విడుదలవుతుంది. త‌ప్ప‌కుండా చూడండి” అన్నారు.

చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ ”మా ప్రిన్స్‌ మహేష్‌బాబుగారు మా వేడుకకి అతిథిగా రావడం ఆనందంగా ఉంది. మా బాధ్యతలను మా యూనిట్‌ చక్కగా నిర్వహించి ఓ మంచి సినిమా చేశాం. నెక్స్‌ట్‌ లెవల్‌ మూవీగా అనిపించింది నాకు. మంచి పేరు, పేరుతో పాటు డబ్బులు కూడా తెచ్చి పెట్టే సినిమా ఇది. ఈ సినిమాను నిర్మించినందుకు ఆనందంగా ఉంది. థాంక్యూ టు ఆల్‌” అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివేక్‌ సాగర్‌ మాట్లాడుతూ ”ఇది నాకు స్పెషల్‌ మూవీ. లిరికల్‌ వేల్యూ, మ్యూజికల్ ఎక్స్‌ప్రెష‌న్‌ ఉన్న సినిమా చేసే అవకాశం ఇచ్చారు ఇంద్రగంటిగారు. బ్యూటీఫుల్‌ మూవీ” అన్నారు.

న‌రేష్ మాట్లాడుతూ ”ఇంద్ర‌గంటిలో విశ్వ‌నాథ్ గారిలా తెలుగుద‌నం.. జంధ్యాల‌గారిలా హాస్య‌ర‌సం.. ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కంటూ ఓన్ బ్రాండ్ క్రియేట్‌ చేసుకున్నారు. నా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇది బెస్ట్ క్యారెక్ట‌ర్ అని చెప్ప‌గ‌ల‌ను. ‘ఆదిత్య 369’ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అదే చిరునవ్వుతో ఉన్నారు నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌. ఇక ఫ‌లితాల‌కు అతీతంగా న‌టుడిగా నిరూపించుకుంటున్నారు సుధీర్ బాబు. త‌న‌కి ‘సమ్మోహ‌నం’ బెస్ట్ హిట్టే కాదు.. బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ అవార్డు కూడా తీసుకు వ‌స్తుంద‌న్న న‌మ్మకం ఉంది. అదితి అందంగా ఉండ‌డ‌మే కాకుండా మంచి అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించింది” అన్నారు.

సుధీర్‌ బాబు మాట్లాడుతూ ” ఈ వేడుకకు రాక‌ముందు చిన్న భ‌యం ఉండేది.. జనాలకు ఈ సినిమా రీచ్‌ అవుతుందో లేదోనని. అయితే మహేష్‌ ఎప్పుడైతే తన కొత్త లుక్‌తో ఈ వేడుకకి వస్తాడని తెలిసిందో.. మంచి నమ్మకం వచ్చింది. ఇంద్రగంటి మోహనకృష్ణగారు ‘సమ్మోహనం’ వంటి మంచి సినిమాను నాకు ఇచ్చారు” అన్నారు.

అదితిరావ్‌ హైదరి మాట్లాడుతూ ”తెలుగులో నా తొలి చిత్రం ఇది. సమీరా అనే చాలా మంచి పాత్ర చేశాను. ఇంద్రగంటిగారు.. అద్భుతమైన సమీర పాత్రను నాతో చేయించినందుకు ఆయనకు థాంక్స్‌. మంచి స్క్రిప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సుధీర్‌ అమేజింగ్‌ కోస్టార్‌. విందా, వివేక్‌సాగర్‌ సహా టీమ్‌ సభ్యులకు థాంక్స్‌” అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు మాట్లాడుతూ ”సుధీర్‌ నా ఫంక్షన్స్‌లో బాగా మాట్లాడుతుంటాడు. తన ఫంక్షన్స్‌లో ఏమో సెంటిమెంటల్‌ అయిపోతున్నాడు. సినిమాలో సూపర్‌హిట్‌ వైబ్స్‌ కనపడుతున్నాయి. నరేష్‌గారు ఈ ఏడాది వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని నాకు ఇప్పుడే చెప్పారు. సినిమా గురించి మంచి రిపోర్ట్స్‌ క్యారీ అవుతున్నాయని పొద్దున దిల్‌ రాజుగారు కూడా చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఇలా ఆడియో ఫంక్షన్స్‌కి రావడం తప్ప.. సుధీర్‌కి మేమేం ఎలాంటి సపోర్ట్ చేయ‌లేదు. తనకు తాను పని చేసుకుంటూ ఇక్కడి వచ్చాడు. ఆ విషయంలో నేను తన గురించి గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. మోహనకృష్ణగారు డైరెక్ట్‌ చేసిన ‘అష్మాచమ్మా’ నాకు ఫేవరేట్‌ ఫిలిం. అంటే.. నా పేరు వాడార‌ని కాదు. అలాగే ఆయన డైరెక్ట్‌ చేసిన ‘జెంటిల్‌మన్‌’ కూడా చూశాను. అదితిరావుకు టాలీవుడ్‌లోకి వెల్‌కమ్‌ చెబుతున్నాను. ‘భ‌ర‌త్ అనే నేను’ త‌రువాత మ‌ళ్ళీ మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here