ఒకే వేదిక‌పై మెగా ఫ్యామిలీ

ఒకే వేదిక‌పై మెగా ఫ్యామిలీ,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Mega Family Heroes to Attend Kalyaan Dhev Vijetha Audio Release,Mega Family Heroes Will Attend Kalyaan Dhev Vijetha Audio Release,Entire Mega family to descend on Vijetha audio launch,Vijetha Movie Updates,Vijetha Telugu Movie Latest News

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ‘విజేత’ పేరుతో తెర‌కెక్కిన‌ ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి నిర్మించారు. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ చిత్రంలో కేర‌ళ కుట్టి మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించింది. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్యక్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. జూలై నెల‌లో ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల 24న అట్ట‌హాసంగా జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌లో మెగా ఫ్యామిలీ హీరోలంతా సంద‌డి చేసే అవ‌కాశ‌ముంద‌ని వినిపిస్తోంది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ఇప్ప‌టికే ఈ వేడుక‌కు హాజ‌రు కావ‌డం ఖాయమ‌య్యింద‌ని.. వీరితో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్ కూడా అటెండ్ కాబోతున్నార‌ని తెలుస్తోంది. ఇక ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఈ ఫంక్ష‌న్‌కు వ‌స్తారా లేదా అన్న విష‌యంపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. ఒక‌వేళ‌ ప‌వ‌న్ కూడా హాజ‌రైతే.. మెగా అభిమానుల‌కు ఈ వేడుక‌ క‌నుల పండ‌గే అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here