ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సీమసింహం’, ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రాలతో ఫ్యాక్షన్ చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు బాలయ్య. వీటిలో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ ఇండస్ట్రీ హిట్ చిత్రాలుగా నిలిచాయి కూడా. ఇదిలా ఉంటే.. ‘చెన్నకేశవ రెడ్డి’ తరువాత దాదాపు 16 ఏళ్ళ గ్యాప్‌తో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు బాలయ్య. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. వచ్చే ఏడాది వేసవిలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సాగే యాక్షన్ చిత్రంగా తెరకెక్కనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83
