పెళ్లిచూపులు డైరెక్టర్ రెండో చిత్రం ఈ నగరానికి ఏమైంది ?

పెళ్లిచూపులు డైరెక్టర్ రెండో చిత్రం ఈ నగరానికి ఏమైంది ?,Telugu Filmnagar,Latest Telugu Movies Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Pelli Choopulu Director Next Movie Ee Nagaraniki Emaindi,Ee Nagaraniki Emaindi Movie Updates,Ee Nagaraniki Emaindi Telugu Movie Latest News,Ee Nagaraniki Emaindi Movie Trailer Releasing Tomorrow,Ee Nagaraniki Emaindi Telugu Movie Trailer Releasing Tomorrow

ఓ చిన్న సినిమాతో పెద్ద విజయాలు చాలా మంది అందుకున్నారు. అలాంటి జాబితాలో పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్‌​ తరుణ్‌ భాస్కర్‌ ఉండాల్సిందే. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ డైరెక్టర్ తన రెండో సినిమాను ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే డిఫెరెంట్ టైటిల్ తోనే రూపొందించాడు. వారం క్రితమే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా యువత నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతుండడంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్ ను రేపే  రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇక ఈ కథ వివరాల్లోకి వెళ్తే …. సుశాంత్ రెడ్డి, విశ్వక్సేన్ నాయుడు, వెంకటేష్ కాకమాను, అభినవ్ గోమటం అనే ఓ నలుగురు మిత్రుల కథ ఇది.. ఒక్కో వ్య‌క్తి ఒక్కో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్. అందులో కార్తీక్ ఎలైట్ పబ్ లో వర్క్ చేసే ఓ మ్యానేజర్. వైన్ టెస్ట్ చేయడంలో సిద్ధహస్తుడు కానీ, ఫ్రెండ్స్ ను సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం పూర్. వివేక్ మన కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్ మంచి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కానీ మందుకు బానిస, కానీ ఆ విషయాన్ని ఒప్పుకోడు. ఉప్పు ఓ వెడ్డింగ్ ఫిలిమ్ ఎడిటర్. బార్ కి వచ్చి మిల్క్ షేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసే టైపు. ఇక మిగిలింది కౌషిక్  . వీళ్ళతోపాటు అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు.. సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై డి సురేష్ బాబు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ‘పెళ్లిచూపులు’ చిత్రం లాగే ఈ చిత్రం కూడా అందరూ కొత్తవారితోనే చిన్న చిత్రంగానే తెరకెక్కుతుంది. మరీ ‘పెళ్లిచూపులు’ లాగే ‘ఈ నగరానికి ఏమైంది ?’ కూడా భారీ విజయం సాధిస్తుందేమో చూడాలి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here