మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నివేదా

Actress Nivetha Thomas Latest News, Heroine Nivetha Thomas Upcoming Movie News, Latest Telugu Movies Movies News, Nivetha Thomas New Movie News, Nivetha Thomas Next Film Updates, Nivetha Thomas Next Movie with Sree Vishnu, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates

‘జెంటిల్ మ‌న్’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక నివేదా థామ‌స్‌. ఆ త‌రువాత ‘నిన్ను కోరి’, ‘జై ల‌వ కుశ‌’, ‘జూలియ‌ట్ ల‌వ‌ర్ ఆఫ్ ఇడియ‌ట్’ సినిమాల్లో సంద‌డి చేసింది. ఈ మ‌ధ్య‌ పై చ‌దువుల కోసం చిన్న విరామం తీసుకున్న నివేదా.. మ‌ళ్ళీ సినిమాల‌పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా.. ఇప్ప‌టికే క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా ఓ సినిమాని అంగీక‌రించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మ‌రో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత క‌థానాయ‌కుడు శ్రీ‌ విష్ణు, ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతోంది. ఇందులో క‌థానాయిక పాత్ర కోసం చిత్ర యూనిట్ నివేదాను సంప్ర‌దించింద‌ట‌. త‌న పాత్ర‌, క‌థ న‌చ్చ‌డంతో నివేదా కూడా ఈ సినిమా చేయ‌డానికి వెంట‌నే ఒప్పుకుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే నివేదా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here