త్రివిక్ర‌మ్‌, నాని కాంబినేష‌న్‌.. నిర్మాత ఎవ‌రంటే?

Hero Nani and Director Trivikram Srinivas Movie Producer Fixed, Latest Telugu Movies Movies News, Nani and Trivikram Srinivas Movie Producer Confirmed, Natural Star Nani and Trivikram Srinivas Movie Producer Locked, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates

నేచుర‌ల్ స్టార్ నానితో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమా చేయ‌బోతున్నారంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ నుంచి త‌న తాజా చిత్రం ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ వ‌ర‌కు హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్‌లోనే వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న త్రివిక్ర‌మ్‌.. ఈ సారి ఇప్ప‌టివ‌ర‌కు త‌ను ప‌నిచేయ‌ని నిర్మాతతో సినిమా చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఆ నిర్మాత మ‌రెవ‌రో కాదు.. సి.క‌ళ్యాణ్‌. ఈ ఏడాది సంక్రాంతికి బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో ‘జై సింహా’ నిర్మించి త‌న ఖాతాలో మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు క‌ళ్యాణ్‌. అలాగే త్వ‌ర‌లోనే బాల‌య్య‌, వి.వి.వినాయ‌క్ కాంబోలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. దీనితో పాటు త్రివిక్ర‌మ్‌, నాని సినిమా కూడా క‌ళ్యాణ్‌నే నిర్మించ‌బోతున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌.. ఎన్టీఆర్‌తో తెర‌కెక్కిస్తున్న ‘అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌’తో బిజీగా ఉండ‌గా.. నాగార్జున కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తూ నాని బిజీగా ఉన్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here