మలయాళంలో ‘రావణాసురన్’ గా సత్తా చాటనున్న జూ. ఎన్టీఆర్

Jr NTR is Raavanasuran in Kerala,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Cinema Updates,Jr NTR Raavanasuran Movie Latest News,Raavanasuran Movie Release Date,Jr NTR Jai Lava Kusa in Kerala,Raavanasuran Malayalam Movie

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం ‘ జై లవకుశ ‘. ప్రపంచ వ్యాప్తంగా 2017 సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ తొలిసారిగా మూడు (జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటించడం జరిగింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే.
గతంలో ఎన్టీఆర్ నటించిన ‘ జనతా గ్యారేజ్ , సినిమా తెలుగులో భారీ విజయం సాధించటంతో ఆ సినిమాను మలయాళంలోకి అనువదించగా, అక్కడ కూడా ఆ సినిమా భారీ వసూళ్ళని మూటగట్టుకున్నది. ఆ సినిమా ఎన్టీఆర్ మార్కెట్ ని మలయాళంలో అమాంతం పెంచేసింది. దాంతో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో వచ్చిన ‘ జై లవకుశ ‘ సినిమాని కూడా మలయాళంలోకి డబ్బింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతున్నారు.
బాబీ దర్శకత్వం వహించిన ‘జై లవకుశ’ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మూడు పాత్రలను పోషించగా , అందులో నెగెటివ్ షేడ్స్ కలిగిన ‘రావణ’ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్రకి సంబంధించిన సాంగ్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అందువలన రావణ పాత్రను హైలైట్ చేస్తూ మలయాళంలో ఈ సినిమాను ‘రావణాసురన్’ పేరుతో విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా అక్కడ ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై  హీరో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు .

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here