శైల‌జారెడ్డి అల్లుడు ఎప్పుడొస్తాడంటే..

Sailaja Reddy Alludu Movie Release Date, Latest Telugu Film News,Telugu Filmnagar,Telugu Movies News 2018,Tollywood Movie Updates,Sailaja Reddy Alludu Movie Shooting Schedule,Naga Chaitanya Shailaja Reddy Alludu Movie Latest News,Naga Chaitanya Next Upcoming Movie,Sailaja Reddy Alludu Release Date Fixed,శైల‌జారెడ్డి అల్లుడు ఎప్పుడొస్తాడంటే
Sailaja Reddy Alludu Movie Release Date

కింగ్ నాగార్జున‌కి క‌లిసొచ్చిన క‌థానాయిక‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. తెర‌పై ఈ ఇద్ద‌రి జోడీ.. అభిమానుల‌ను మురిపించింది. క‌ట్ చేస్తే.. నాగ్‌కు జోడీగా సంద‌డి చేసిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌కు అత్త‌గా న‌టిస్తోంది. ‘శైల‌జారెడ్డి అల్లుడు’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే స‌గ‌భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం ద్వితీయార్థానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉంది. కాగా.. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్‌ను ఈ నెల 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయ‌నున్నారు. 15 రోజుల పాటు జ‌రిగే ఈ షెడ్యూల్లో ర‌మ్య‌కృష్ణ‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. ఇక జూలైలో రాజమండ్రి, అమలాపురంలో మరో షెడ్యూల్‌ తెరకెక్కిస్తారు. దీంతో.. సినిమాకి సంబంధించిన మేజ‌ర్ పార్ట్ పూర్త‌యిన‌ట్టే.

అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న‌ ఈ చిత్రాన్ని ఆగ‌స్టు చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here