కాలా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

కాలా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Kaala Pre Release Event,Kaala Movie Updates,Kaala Telugu Movie Latest News, Kaala Movie Pre Release Function,Rajinikanth Kaala Telugu Movie Pre Release Event

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి సినిమా వ‌స్తుందంటే బాక్సాఫీస్ వ‌ద్ద ఉండే సంద‌డే వేరు. పేరుకి త‌మిళ క‌థానాయ‌కుడు అయిన‌ప్ప‌టికీ.. దేశ‌వ్యాప్తంగా ఆయ‌న సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. ఇక ప్రారంభ వ‌సూళ్ళు అయితే రికార్డు స్థాయిలో న‌మోదు చేసుకుంటాయి. అలాంటి ర‌జ‌నీ నుంచి సినిమా వ‌చ్చి రెండేళ్ళ‌వుతోంది. త‌న‌ గ‌త చిత్రం ‘క‌బాలి’ని రూపొందించిన పా.రంజిత్ కాంబినేష‌న్‌లోనే సూప‌ర్ స్టార్ మ‌రో సినిమా చేశారు. అదే ‘కాలా’. ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న తెర‌పైకి రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ సోమ‌వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో రజనీకాంత్‌, ధనుష్‌, పా.రంజిత్‌, సంతోష్ నారాయ‌ణ్‌, హ్యుమా ఖురేషి, ఈశ్వరీరావు, ఎ.ఎం.రత్నం, లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధి కరుణాకరన్‌, ఎన్‌.వి.ప్రసాద్‌, దిల్‌రాజు, మారుతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా..ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ – ”రజనీకాంత్‌గారి గురించి చెప్పాలంటే ఆయన సింప్లిసిటీ, స్టయిల్‌ చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌. ఆయ‌న న‌టించిన‌ ‘అరుణాచలం’, ‘నరసింహా’ సినిమాల‌ను తెలుగులో అనువ‌దించాను. ఈ రెండు సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆయన్ను అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులు అభిమానిస్తారు ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ – ”రజనీకాంత్ గారు న‌టించిన‌ `బాబా` సినిమాను సీడెడ్‌లో నేనే విడుదల చేశాను. ఆ సినిమా విడుదలైన వారం తర్వాత రజనీకాంత్‌గారు ఫోన్‌ చేసి సినిమా ఎలా ఉంది? అని అడిగారు. యావరేజ్‌గా ఉందని అన్నాను. ఆయన మద్రాసు పోన్ చేసి పిలిపించారు. సినిమా ఎంత లాస్‌ అయ్యిందో మేనేజర్‌ ద్వారా కనుక్కున్నారు. కోటి అరవై లక్షల నష్టం తేలింది. మరుసటి రోజు మళ్లీ రమ్మని పిలిచి కోటి అరవై లక్షలతో పాటు మరో లక్ష రూపాయలను అదనంగా ఇచ్చిన గొప్ప వ్యక్తి రజనీకాంత్‌గారు. సినిమా ఇండస్ట్రీ చరిత్రలో మనకు కనపడే దేవుడు రజనీకాంత్‌గారు. ఇండియన్‌ సినిమాల్లో ‘కాలా’ గ్రేటెస్ట్‌ మూవీగా ఇది నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను” అన్నారు.

ఈశ్వరీరావు మాట్లాడుతూ – నా జీవితంలో మ‌ర‌చిపోలేని పాత్ర ఏదైనా ఉందంటే.. అది ఈ సినిమాలోని పాత్రే. రజనీకాంత్‌గారికి జోడిగా ఈ సినిమాలో నటించ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి” అన్నారు.

హ్యూమా ఖురేషి మాట్లాడుతూ – ”రజనీకాంత్‌గారితో కలిసి నటించడం గొప్ప అదృష్టం. బ్యూటీఫుల్‌ స్క్రిప్ట్‌తో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా జర్నీలో భాగమైనందుకు ఆనందంగా ఉంది” అన్నారు.

సంతోష్‌ నారాయణ్‌ మాట్లాడుతూ – ”ముంబైలోని ధారావి ప్రాంతానికి చెందిన‌ స్లమ్‌ ప్రజల గురించి ఈ సినిమా చెబుతుంది. ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంకా 60 శాతం మందికి.. ఉండటానికి సొంత జాగా లేదు. అది ఎందుకో తెలియదు కానీ.. మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ సమస్య గురించి ‘కాలా’ చిత్రంలో పెద్ద ఎత్తున డిస్కస్‌ చేశారు. రజనీకాంత్‌గారి వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ యాక్టింగ్‌ను మరోసారి ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాకు సంగీతం అందించడాన్ని ఎంజాయ్‌ చేశాను” అన్నారు.

మారుతి మాట్లాడుతూ – ”రజనీకాంత్‌గారి గురించి, ఈ సినిమా గురించి మాట్లాడేటంత స్థాయి నాది కాదు. అద్భుతమైన సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ట్రైలర్స్‌ అన్నీ చాలా బావున్నాయి. రజనీకాంత్‌గారు ఇలాంటి మంచి సినిమాలను ఎన్నింటినో చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ – ”రత్నంగారు 1999లో చేసిన `నరసింహా` సినిమాను నేను నైజాంలో పంపిణీ చేశాను. మ‌ళ్ళీ 19 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌గారి సినిమాను నైజాంలో రిలీజ్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా పెద్ద హిట్‌ సాధించాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ టు టీమ్‌” అన్నారు.

పా.రంజిత్‌ మాట్లాడుతూ – ” ‘కాలా’ సినిమాపై భారీ అంచనాలుంటాయనడంలో సందేహం లేదు. అయితే.. సినిమా చూసే ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు. అలాగే రజనీసార్ యాక్టింగ్‌ను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. భూ సమస్యలు గురించి ఈ సినిమాలో చూపించాం. భూమి అనే హక్కును చూపించాం. డిఫరెంట్ స్టైల్లో రజనీకాంత్‌గారి హీరోయిజాన్ని చూస్తారు. స్లమ్‌లో ఉండే ప్రజల మనిషిగా రజనీగారి న‌ట‌న గుర్తుండిపోతుంది” అన్నారు.

నిర్మాత ధనుష్‌ మాట్లాడుతూ – “కాలా`.. ప్రజల సినిమా. ప్రజలకోసం, ప్రజల గురించి చేసిన సినిమా ఇది. బోల్డ్‌ సినిమా. డైరెక్టర్‌ రంజిత్‌ ధారావి ప్రజలు ఎలా జీవిస్తారనే దానిపై రీసెర్చ్ చేసి ఈ సినిమా రూపొందించారు. ఇండస్ట్రీలోకి వచ్చే చాలా మంది హీరోలు రజనీకాంత్‌లా కావాలని కలలు కంటారు. కానీ రజనీకాంత్‌ ఒకడే. ఆయన న‌టించిన సినిమాను నేను నిర్మించడం నా అదృష్టం. అవకాశం ఇచ్చిన రజనీ సార్‌, ఎంటైర్‌ యూనిట్‌కి థాంక్స్‌. ప్రేక్షకులు, విమర్శకులు అందరూ ఎంజాయ్‌ చేసే చిత్రమవుతుంది” అన్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ – ”1978లో నా తొలి తెలుగు సినిమా ‘అంతులేని కథ’ విడుదలైంది. ఆ తర్వాత ‘అన్నదమ్ముల సవాల్‌’, ‘ఇద్దరూ అసాధ్యులే’, ‘తొలిరేయి గడిచింది’ ఇలా 15-20 సినిమాలు తెలుగులో చేశాను. తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. బ్రేక్‌ వచ్చింది. ఒకానొక‌ స‌మ‌యంలో.. తెలుగులో సినిమాలు చేయాలా? తమిళంలో సినిమాలు చేయాలా? అనే ప్రశ్న వచ్చింది. అయితే కె.బాలచందర్‌ దర్శకత్వంలో నేను తమిళంలో తొలి సినిమా చేశాను. ..కాబట్టి తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాను. అయితే తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమను చూపించారో.. అంతే ప్రేమను తెలుగు ప్రేక్షకులు కూడా చూపిస్తూ వ‌చ్చారు… వస్తున్నారు. అది నా భాగ్యం. తర్వాత ‘పెదరాయుడు’లో నటించాను. తర్వాత `భాషా’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహా’, ‘చంద్రముఖి’, ‘శివాజీ’, ‘రోబో’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను. సీనియర్‌ ఎన్టీఆర్‌గారు ఉన్నప్పుడు ఆయన్ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఈ సమయంలో ఆయన్ను మిస్‌ అవుతున్నాను. చాలా గుర్తుకొస్తున్నారు. అది ఎందుకో అందరికీ తెలిసిందే. కె.బాలచందర్‌గారి తర్వాత నా గురువు దాసరి నారాయణరావుగారు. ఆయన్ను కూడా ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాను. చాలా పెద్ద మనిషి.. పెద్ద దర్శకుడు. ఓ బిడ్డలా నన్ను ప్రేమించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ధనుష్‌గారు ఇంతకు ముందు ‘రజనీకాంత్ ఒక‌రే’ అని చెప్పారు. అయితే చిరంజీవి ఒక‌రే.. నాగార్జున ఒక‌రే.. బాలకృష్ణ ఒక‌రే.. వెంకటేష్ ఒక‌రే.. ఇలా అందరూ ఎవరికీ వారు ప్రత్యేకం. కేవలం అవకాశమే అందరినీ పెద్ద వ్యక్తులుగా చేస్తుంది. ఇండస్ట్రీలో దొరికే అవకాశాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవకాశం రావడం అదృష్ఠం. అవకాశం రావడాన్ని దేవుడుపై నమ్మకం లేనివారు లక్‌ అని అంటే.. దేవుడిపై నమ్మకం ఉండేవాళ్లు దేవుడి ఆశీర్వాదం అంటారు. ఏ రంగం అయినా.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. కష్టపడి.. అంకిత‌భావంతో పనిచేస్తే దానికి ప్రతిఫలం దొరుకుతుంది. రంజిత్‌తో ఇంతకు ముందు ‘కబాలి’ సినిమా చేశాను. ఆ సమయంలో రజనీలాంటి హీరో యువ దర్శకుడితో సినిమా చేయడమేంటని చాలా మంది అన్నారు. అయితే రంజిత్‌ కథ చెప్పినప్పుడే నేను ఇంప్రెస్‌ అయ్యాను. రంజిత్ ‘కబాలి’ని చక్కగా డైరెక్ట్‌ చేశారు. దాంతో మళ్లీ మేమిద్దరం కలిసి మా అల్లుడు ధనుష్‌ నిర్మాణంలో ‘కాలా’ సినిమా చేశాం. నేను సినిమాను రెండుసార్లు చూశాను. కమర్షియల్‌గానే కాకుండా.. సినిమాలో మంచి మెసేజ్‌ కూడా ఉంది. రియాలిటీని మిక్స్‌ చేసి కమర్షియల్‌ సినిమాను తెరకెక్కించడం రంజిత్‌ స్పెషాలిటీ. చాలా బాగా ప్రెజెంట్‌ చేస్తారు. ఆసియాలోనే చాలా పెద్ద స్లమ్‌ ధారావి. ఆ స్లమ్‌లోని మనుషుల జీవితం ఎలా ఉంటుంది? వారికి ఎలాంటి సమస్యలుంటాయి? అనే అంశాలతో సినిమా చేశాం. సాధారణంగా ఏ సినిమాలోనైనా హీరో క్యారెక్టర్‌కో, మరో క్యారెక్టర్‌కో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ‘కాలా’ సినిమాలో ఐదారు పాత్ర‌ల‌కు మంచి ప్రాముఖ్య‌త‌ ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్ మనల్ని వెంటాడ‌తాయి. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్‌ ది బెస్ట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఈశ్వరీరావు , హ్యూమా ఖురేషీ.. ఇలా అంద‌రూ అద్భుతంగా నటించారు. ధనుష్‌ నిర్మాతగా ఎలా చేస్తారో అనే సందేహం ఉండేది. ”నేను చక్కగా నటించడమే కాదు.. చక్కగా సినిమాను నిర్మిస్తాన”ని ప్రూవ్‌ చేశారు ధనుష్‌. త‌ప్ప‌కుండా అంద‌రికీ సినిమా నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది” అన్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here