ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ని స్వీకరించిన కళ్యాణ్ రామ్ !!

#HumFitTohIndiaFit, Kalyanram takes up Jr NTR fitness challenge nominates Allu Arjun, Latest Telugu Movies News, Nandamuri Kalyan Ram Accepted Jr NTR Fitness Challenge, Nandamuri Kalyan Ram Fitness Challenge to Allu Arjun, Nandamuri Kalyan Ram Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ని స్వీకరించిన కళ్యాణ్ రామ్

కేంద్ర‌మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ కు సెలబ్రిటీల నుండి అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనం రోజూ చూసే తారలు అస్సలు కనిపించడం లేదు. రోజు ఎదో ఒక స్టైలిష్ ఫొటోతో కనిపించే సెలబ్రెటీలు ఇప్పుడు జిమ్ లో ఫొటోలకు పోజులిస్తున్నారు. గత కొంత కాలంగా మన ఇండియన్ సెలబ్రెటీలు జిమ్ వర్కౌట్స్ ద్వారా ఛాలెంజ్ విసురుకుంటున్న సంగతి తెలిసిందే. అది బాలీవుడ్ నుంచి ఇప్పుడు టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.
సినీనటుడు మోహన్ లాల్ తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు ”హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ” అనే ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. ఆయన ఛాలెంజ్‌ను స్వీకరించిన తారక్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీసుకున్న వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ …. అదే ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్‌ ని మహేశ్‌ బాబు, నందమూరి కల్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అనే ఛాలెంజ్ విసిరారు.
తాజాగా… కళ్యాణ్ రామ్ ట్రైనర్ సమక్షంలో జిమ్ లో చెమటోడ్చిన వీడియోని అప్ లోడ్ చేసారు. తరువాత కళ్యాణ్ రామ్ అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ , రామ్ లకు ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ను దేశంలోని చాలా మంది సెలబ్రిటీలు స్వీకరిస్తోన్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ విసిరిన ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ కు టాలీవుడ్ హీరోలు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే!.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here