‘నా నువ్వే’ రిలీజ్ డేట్ ఫిక్స్!!

Kalyan Ram Naa Nuvve Satellite Rights Sold For Good Price, Latest Telugu Movies News, Naa Nuvve Movie Release Date Confirmed, Naa Nuvve Movie Updates, Naa Nuvve Telugu Movie Latest News, Nandamuri Kalyan Ram Naa Nuvve Movie Satellite Rights, Nandamuri Kalyan Ram Naa Nuvve Telugu Movie Release Date Locked, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, నా నువ్వే రిలీజ్ డేట్ ఫిక్స్
Naa Nuvve Movie Release Date Confirmed

నందమూరి కళ్యాణ్ రామ్ మంచి స్పీడ్ లో ఉన్నాడు. కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్ఎల్ఏ సినిమా హిట్ అయింది. ఈ సినిమా హిట్ తరువాత కళ్యాణ్ రామ్ బయటి బ్యానర్లో నా నువ్వే సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్‌రామ్‌, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో ఈస్ట్‌ కోస్ట్‌ప్రొడక్షన్స్‌ మహేష్‌ కోనేరు సమర్పణలో కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ పతాకంపై కిరణ్‌ ముప్పవరపు, విజరు వట్టికూటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నా నువ్వే’. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్, ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చిత్ర హక్కులకి మంచి డిమాండ్ నెలకొంది.
తాజాగా విడుదలైన ‘నా నువ్వే’ పాటలు హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ప్రత్యేకమైనవిగా, ఉత్తమమైనవిగా నిలిచిపోతాయనడంలో సందేహమే లేదు. సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ పాటలకు తన బాణీలతో ప్రాణం పోసి కొన్ని పాటల్ని మళ్ళీ మళ్ళీ వినాలనేలా చేశారు. ముఖ్యంగా ‘ప్రేమిక, నా నువ్వే, చినికి చినికి, నిజమా మనసా’ లాంటి పాటలు చాలా బాగుండగా ‘హేయ్ హేయ్ ఐ లవ్ యు, రైట్ రైట్’ పాటలు పర్వాలేదనిపించాయి. మొత్తం మీద సంగీత ప్రియులను మెప్పించే ఈ పాటలు సినిమాను మంచి మ్యూజికల్ హిట్ గా నిలబెట్టేలా ఉన్నాయని చెప్పొచ్చు.
ఇదిలావుంటే …. ఈ సినిమా యొక్క ఉత్తరాంధ్ర హక్కులను జిఎన్ ఫిలిమ్స్, ఏవిఆర్ ఫిలిమ్స్ కలిపి రూ.1.40 కోట్లకు కొనుగోలుచేశారు. కళ్యాణ్ రామ్ సినిమాకు ఇది మంచి ధరనే చెప్పాలి. జూన్ 14న విడుదలకు భారీ సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు :
కళ్యాణ్ రామ్, తమన్నా , వెన్నెల కిషోర్ తదితరులు.
దర్శకత్వం : జయేంద్ర
నిర్మాత : కిరణ్‌ ముప్పవరపు, విజరు వట్టికూటి
సంగీతం : శరత్ వాసుదేవన్
సినిమాటోగ్రఫీ : పిసి.శ్రీరామ్

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here