అరవింద సమేత వీర రాఘవ కోసం ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్!

Aravindha Sametha Movie Updates, Aravindha Sametha Telugu Movie Latest News, Jr NTR Shocking Decision For Aravindha Sametha Veera Raghavan, Latest Telugu Movies News, NTR Shocking Decision For Aravindha Sametha Movie, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, అరవింద సమేత వీర రాఘవ కోసం ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై యస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే… ఈ సినిమా పూర్తి అయ్యేవరకు ఎన్టీఆర్ విరామం లేకుండా పని చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ఈ రోజు నుండి తాజా షెడ్యూల్స్ మొదలుపెట్టనున్నారు. ఈ తాజా షెడ్యూల్ భారీగా నెల రోజుల పాటూ సాగనుందని సమాచారం. ఎన్టీఆర్ తో పాటు పలువురు ముఖ్య తారాగణం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. బ్రేక్‌ లేకుండా ఈ షూటింగ్‌ తర్వగా కంప్లీట్‌ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్న ఈ చిత్రంలోతారక్ సిక్స్ ప్యాక్ లుక్లో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ తొలిసారి ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను అక్టోబర్‌ 11న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , పూజా హెగ్డే
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : యస్‌. రాధాకృష్ణ
సంగీతం : యస్‌.యస్‌.తమన్
కెమెరా : పీయస్‌ వినోద్‌.
మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here