యాక్ష‌న్ మోడ్‌లో సైరా

Chiranjeevi in action mode, Chiranjeevi Sye Raa Movie Action Scenes Started Shooting, Chiranjeevi Sye Raa Movie in Action Mode, Latest Telugu Movies News, Sye Raa Movie Updates, Sye Raa Telugu Movie Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, యాక్ష‌న్ మోడ్‌లో సైరా

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ హిస్టారికల్ ఫిల్మ్‌ను దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక పాత్ర పోషిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజ‌య్ సేతుప‌తి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్‌లో భాగంగా ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 7వ తేదీ నుండి హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో బ్రిటీషు వారిపై నరసింహారెడ్డి దాడి చేసే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనీ.. కొంతమంది హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సన్నివేశాలు చాలా ఆసక్తిని రేకెత్తించేవిగా ఉంటాయని సమాచారం. కాగా.. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here