ద‌టీజ్ మహాలక్ష్మి అంటున్న త‌మ‌న్నా

Latest Telugu Film News, Tamanna New Movie That is Mahalakshmi, Telugu Filmnagar, Telugu Movies News 2018, That Is Mahalakshmi Movie Updates, That Is Mahalakshmi Telugu Movie Latest News, That Is Mahalakshmi Title for Tamanna Queen Remake, Tollywood Cinema Updates, ద‌టీజ్ మహాలక్ష్మి అంటున్న త‌మ‌న్నా

హిందీలో విజ‌య‌వంత‌మైన ‘క్వీన్’ చిత్రం ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వెర్ష‌న్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. నీలకంఠ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న తప్పుకోవడంతో ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మైసూరులో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘ద‌టీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. తమన్నా కెరీర్‌లో విజయవంతమైన సినిమాల్లో ‘100% లవ్’ ఒక‌టి. ఆ సినిమాలో తమన్నా పోషించిన పాత్ర పేరు మహాలక్ష్మి. అలాగే అందులోని ‘ద‌టీజ్ మహాలక్ష్మి’ అనే పాట కూడా బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో.. ఈ సినిమా టైటిల్ కోసం ‘ద‌టీజ్ మహాలక్ష్మి’ పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. హిందీలో లిసా హేడన్ పోషించిన పాత్రను తెలుగులో షిబాని దండేకర్ పోషిస్తోంది. కాగా.. మైసూరు షెడ్యూల్ త‌ర్వాత ప్రారంభ‌మ‌య్యే యూరప్ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాణ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here