2019 సంక్రాంతికి క్రిష్ డైరెక్షన్లో బాలకృష్ణ “అహం బ్రహ్మాస్మి” !

2019 సంక్రాంతికి క్రిష్ డైరెక్షన్లో బాలకృష్ణ అహం బ్రహ్మాస్మి, Aham Brahmasmi Movie Updates, Aham Brahmasmi Telugu Movie Latest News, Balakrishna as Hero in Krish Aham Brahmasmi, Balakrishna Next Film With Director Krish, Director Krish Aham Brahmasmi With Balayya, Latest Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Cinema Updates
గమ్యం, వేదం , కృష్ణం వందే జగద్గురుం , కంచె వంటి చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడు అనిపించుకున్నాడు దర్శకుడు క్రిష్. గమ్యం సినిమా తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ డైరెక్టర్ ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించాడు. క్రిష్ అందరిలాగా కమర్షియల్ సినిమాలపై అస్సలు మొగ్గుచూపడు. ఎప్పుడు ప్రేక్షకులకు ఎదో ఒకటి కొత్తగా చూపించాలన్న తపనతో ఉంటాడు.
గౌతమి పుత్ర శాతకర్ని బాలయ్య కు మరియు ఫాన్స్ కు మర్చిపోలేని సినిమా. ఎందుకంటే అది బాలకృష్ణ 100వ సినిమా కాబట్టి. పైగా సూపర్ హిట్ అవడమే కాదు బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డులు సృష్టించిన చారిత్రాత్మక చిత్రం. క్రిష్ తన తదుపరి ప్రాజెక్ట్ ఒక పెద్ద హీరో తో చేస్తానని దాని టైటిల్ “అహం బ్రహ్మాస్మి” అని ఎప్పుడో చెప్పేసాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అని తర్జన భర్జన పడుతున్నపుడు తెల్సింది ఏంటి…? అంటే ఆ హీరో ఎవరో కాదు… నందమూరి బాలకృష్ణ అని. అవును. ఇంతకుముందు గౌతమి పుత్ర శాతకర్ని లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ మళ్ళీ మన ముందు ఇంకొక సినిమాను తీసుకురాబోతోంది. మళ్ళీ మరోసారి 2019 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ మరియు క్రిష్. అయితే ముందు క్రిష్ , బాలయ్య చేయబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఒక కొలిక్కి వచ్చాక , 2019 సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి 2017 సంక్రాతి సెంటిమెంట్ ను 2019 లో కూడా బాలకృష్ణ , క్రిష్ కాంబో రిపీట్ చేస్తుందేమో చూడాలి.మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here