‘తేజ్ ఐ ల‌వ్ యు’ ప్రెస్‌మీట్‌

Latest Telugu Film News, Sai Dharam Tej Tej I Love You Movie Updates, Supreme Hero Sai Dharam Tej Tej I Love You Telugu Movie Press Meet, Tej I Love You Movie Press Meet, Tej I Love You Press Meet, Tej I Love You Telugu Movie Latest News, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Cinema Updates, తేజ్ ఐ ల‌వ్ యు ప్రెస్‌మీట్‌

సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన చిత్రం ‘తేజ్ ఐ ల‌వ్ యు’. ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. కాగా.. గురువారం ఈ సినిమా వివ‌రాల‌ను తెలియ‌జేయ‌డానికి చిత్ర యూనిట్ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ”నిర్మాతగా 35 ఏళ్ల ప్ర‌యాణం నాది. ఈ ప్ర‌యాణంలో డ‌బ్బింగ్ సినిమాల‌తో స‌హా 44 సినిమాలు నిర్మించారు. విడుద‌ల‌కు సిద్ధ‌మైన ‘తేజ్ ఐ ల‌వ్ యు’ నా 45వ చిత్రం. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ క్లీన్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ‘వాసు’ త‌రువాత ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మా సంస్థ నిర్మించిన ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌న్న నమ్మ‌కం ఉంది. సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది. గోపీసుంద‌ర్ సంగీతం ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఇందులో మొత్తం ఐదు పాట‌లున్నాయి. ఈ నెల 2న ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేయ‌బోతున్నాం. అలాగే 9న ఆడియో వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నాము. నెలాఖ‌రుకు సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నాము” అని అన్నారు. ద‌ర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్ మాట్లాడుతూ ”ద‌ర్శ‌కుడిగా నా ప‌దో చిత్ర‌మిది. నా మొద‌టి సినిమాని అన్న‌య్య (ప‌వ‌న్ క‌ళ్యాణ్‌)తో చేశాను. ఇప్పుడు ప‌దో సినిమాని ఆయ‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో చేయ‌డం ఆనందంగా ఉంది. గోపీసుంద‌ర్ సంగీతం, ఆండ్రూ కెమెరా వ‌ర్క్ సినిమాకి ప్ల‌స్ పాయింట్స్” అని తెలిపారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here