వైరల్ గా మారిన ”హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ” ఫిట్ నెస్ ఛాలెంజ్ !!

Jr NTR Accepted Mohanlal Fitness Challenge, Jr NTR accepts Mohanlal Fitness Challenge, Jr NTR Ntr Fitness Challenge to Celebrities, Latest Telugu Film News, Mohanlal passes fitness challenge to Jr NTR, Ntr Fitness Challenge to Celebrities, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Cinema Updates, వైరల్ గా మారిన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ఫిట్ నెస్ ఛాలెంజ్

కొద్దిరోజులుగా క్రికెట‌ర్లు, ఫిల్మ్‌స్టార్‌ల‌ను ఫిట్‌నెస్ ఛాలెంజ్ జ్వ‌రం ప‌ట్టుకుంది. కేంద్ర‌మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు సెలబ్రిటీల నుండి అనూహ్య స్పందన వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనం రోజూ చూసే తారలు అస్సలు కనిపించడం లేదు. రోజు ఎదో ఒక స్టైలిష్ ఫొటోతో కనిపించే సెలబ్రెటీలు ఇప్పుడు జిమ్ లో ఫొటోలకు పోజులిస్తున్నారు. గత కొంత కాలంగా మన ఇండియన్ సెలబ్రెటీలు జిమ్ వర్కౌట్స్ ద్వారా ఛాలెంజ్ విసురుకుంటున్న సంగతి తెలిసిందే. అది బాలీవుడ్ నుంచి ఇప్పుడు టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.

సినీనటుడు మోహన్ లాల్ తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు ”హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ” అనే ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. ఆయన ఛాలెంజ్‌ను స్వీకరించిన తారక్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీసుకున్న వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈ ఫిట్‌నెస్ చాలెంజ్‌లో భాగంగా హృతిక్‌ రోషన్‌, విరాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌‌, దీపికా పదుకొనే, అఖిల్ అక్కినేని, నాగ చైతన్య, సమంత, రకుల్ ప్రీత్ తదితరులు జిమ్‌లో కసరత్తులు చేసే ఫోటోలు, వీడియోలనే షేర్ చేశారు.

తాజాగా … జూనియర్ ఎన్టీఆర్ అదే ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్‌ ని మహేశ్‌ బాబు, నందమూరి కల్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అనే ఛాలెంజ్ విసిరారు.. అయితే, రామ్‌ చరణ్‌ తేజ్‌కు ట్విట్టర్‌ అకౌంట్‌ లేకపోవడంతో తన ఛాలెంజ్‌ విషయాన్ని చెర్రీతో చెప్పాలని ట్విట్టర్‌లో ఉపాసనను కోరారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ ను దేశంలోని చాలా మంది సెలబ్రిటీలు స్వీకరిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here