వెంకీతో బాలీవుడ్ బ్యూటీ?

Bollywood Heroine in Venkatesh Movie, Heroines finalised for Venkatesh And Varun Tej Movie, Latest Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Cinema Updates, Venkatesh Locks This Bollywood Heroine, Venky gets a Bollywood heroine, వెంకీతో బాలీవుడ్ బ్యూటీ

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా యంగ్ డైరెక్టర్ కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని సురేష్ బాబు, కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంద‌ని స‌మాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందీ చిత్రం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసారని ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. అలాగే వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ కోసం చాలా మంది పేర్లను పరిశీలించారు. వీరిలో న‌య‌న‌తార పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. తాజాగా.. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి పేరు కూడా చేరింది. ప‌లు విజయవంతమైన హిందీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హ్యూమా.. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కాలా’తో ద‌క్షిణాదిలో అడుగుపెడుతోంది. త్వ‌ర‌లోనే హ్యుమా ఎంట్రీపై ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ యూనిట్ నుంచి క్లారిటీ వ‌స్తుంది. కాగా.. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here