ఆఫీస‌ర్ రిజ‌ల్ట్ ఎలా ఉన్నా హ్యాపీ – నాగ్‌

ఆఫీస‌ర్ రిజ‌ల్ట్ ఎలా ఉన్నా హ్యాపీ నాగ్‌,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Nagarjuna About Officer Movie,Officer Movie Updates,Officer Telugu Movie Latest News,Akkineni Nagarjuna About Officer Movie,Hero Akkineni Nagarjuna About Officer Telugu Movie,Actor Akkineni Nagarjuna About Officer

తెలుగు తెర‌పై సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం ‘శివ‌’. ‘శివ‌’కి ముందు, త‌రువాత అన్నంత‌గా ఆ సినిమా తెలుగు ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌భావం చూపింది. కింగ్ నాగార్జున‌, సంచ‌ల‌న ద‌ర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మొద‌టి సినిమా అది. ఆ సినిమా త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో ‘షివ’ (హిందీ), ‘అంతం’, ‘గోవిందా గోవింద’ వ‌చ్చాయి. మ‌ళ్ళీ 24 ఏళ్ళ త‌రువాత ఈ క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం ‘ఆఫీస‌ర్‌’. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా శుక్ర‌వారం తెర‌పైకి రానుంది. ఈ సంద‌ర్భంగా గురువారం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో నాగార్జున‌, రామ్ గోపాల్ వ‌ర్మ‌, మైరా స‌రీన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..

మైరా స‌రీన్ మాట్లాడుతూ – ”ఆర్టిఫీషియ‌ల్ లీడింగ్ రోల్ కాకుండా ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టించ‌డం ఆనందంగా ఉంది. నాగ్‌, వ‌ర్మ కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి” అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ – ”ఆర్జీవీ, నేను సిన్సియ‌ర్ ఎఫ‌ర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. ఈ సినిమా జ‌ర్నీని బాగా ఎంజాయ్ చేశాము. ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం క్రితం ఆర్జీవీ ఈ సినిమా లైన్ చెప్పారు. అయితే.. ఆర్జీవీ వైల్డ్ హార్స్ లాంటి వాడు. రెండు నెల‌ల త‌రువాత వేరే ఆఫ‌ర్ సెట్ అయితే వెళ్ళిపోయే ర‌కం. అందుకే ఈ సినిమా చేయ‌డానికి సంకోచించాను. త‌న మైండ్ సెట్ తెలుసు కాబ‌ట్టి నా శైలిలో త‌న‌కు టెస్ట్ పెట్టుకున్నాను. అందులో త‌ను పాస్ అయ్యాడు. ఇంత‌కీ ఆ టెస్ట్ ఏమిటంటే.. త‌ను లైన్ చెప్పిన త‌రువాత మ‌ళ్ళీ నాలుగు నెల‌ల త‌రువాత క‌ల‌వ‌మ‌ని చెప్పా. త‌ను ప్రాజెక్ట్‌పై సీరియ‌స్‌గా లేక‌పోతే.. ఆ గ్యాప్‌లో వేరే ప్రాజెక్ట్ సెట్ చేసుకునేవాడు. అయితే సీరియ‌స్‌నెస్ ఉండ‌డం వ‌ల్ల ఈ ప్రాజెక్ట్‌పైనే ఫోక‌స్ పెట్టాడు. దాంతో.. స‌బ్జెక్ట్ ఆల్రెడీ న‌చ్చ‌డంతో ఈ సినిమా చేసేందుకు అంగీక‌రించాను. గ‌త న‌వంబ‌ర్‌లో ప్రారంభ‌మైన మా సినిమా.. రేపు మీ ముందుకు రాబోతోంది. ఆర్జీవీకి టెక్నీక‌ల్ నాలెడ్జ్ ఎక్కువ‌. ‘శివ’ స‌మయంలో మోనో సౌండ్ ట్రాక్ అయిన‌ప్ప‌టికీ.. ఆ సినిమా సౌండ్ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నారు. టెక్నాల‌జీ బాగా ఇంఫ్రూవ్ అయ్యాక వ‌స్తున్న ఈ సినిమాలోనూ సౌండ్ కొత్త‌గా ఉంటుంది. అంద‌రూ మాట్లాడుకునేలా ఉంటుంది. సౌండ్‌, ఎడిటింగ్ విష‌యంలో వ‌ర్మ ఆడుకునే విధానం ఈ సినిమాలోనూ క‌నిపిస్తుంది. సౌండ్ ఎలా ఉంటుందంటే.. పంచ్ అవ‌స‌రమైన చోట ఆ పంచ్ వ‌స్తే.. అది గుండెల వ‌ర‌కు వెళుతుంది” అని తెలిపారు.

రామ్ గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ – ”సినిమాల విష‌యంలో నేను వైల్డ్ హార్స్ లాంటివాడిని.. ట్విట్ట‌ర్ విష‌యంలో వైల్డ్ మంకీ లాంటివాడిని. అలాగ‌ని నేను సినిమాని సీరియ‌స్‌గా తీసుకోను అన‌డం క‌రెక్ట్ కాదు. ఒక సినిమా చేసేట‌ప్పుడు ఈ సినిమాకి స‌బ్జెక్ట్‌తో పాటు టెక్నీక‌ల్‌గా కొత్త‌గా ఏమి ఇవ్వాల‌ని ఆలోచిస్తాను. అలా.. ‘ఆఫీస‌ర్’ విష‌యంలో న్యూ సౌండ్‌, ఎడిటింగ్ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఈ సినిమాని అద‌న‌పు శ్ర‌ద్ధ‌తో చేశాను. ‘శివ‌’లో కంటే మంచి ఇంటెన్సిటీ ఉన్న పాత్ర‌ను నాగ్ ఇందులో చేశారు. అలాగే నా సినిమాల్లో.. ‘శివ‌’ త‌రువాత హీరోయిజం ఉన్న పాత్ర.. మ‌ళ్ళీ ఇదే అని చెప్ప‌గ‌ల‌ను. ‘ఆఫీస‌ర్’ త‌ప్ప‌కుండా కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది” అని అన్నారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here