సూర్య 37వ సినిమా షూటింగ్ లండన్లో ప్రారంభం కానుంది!!

Actor Suriya 37th Movie Shooting Updates, Latest Telugu Film News, SURIYA 37 Begins in London, Suriya 37 Film Shoot will Start in London, Suriya 37th Movie Latest News, Suriya 37th Movie Updates, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Movie Updates, సూర్య 37వ సినిమా షూటింగ్ లండన్లో ప్రారంభం కానుంది

తమిళ స్టార్ హీరో సూర్య తోటి హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ప్రస్తుతం తన కెరీర్ లో 36 వ సినిమా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వేగంగా పూర్తి చేసేస్తున్నాడు. ఇది అయిపోకముందే.. 37, 38, 39వ సినిమాలను కూడా లైన్ లో పెట్టేసి ఎవరికీ అందనంత దూకుడును ప్రదర్శించేస్తున్నాడు. తెలుగులోనూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య దూకుడుతో అతని అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.
తాజాగా … కెవి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య తన 37వ సినిమాను చేయనున్నారు. కెవి. ఆనంద్ తో కలిసి గతంలో సూర్య ‘బ్రదర్స్, వీడొక్కటే’ వంటి ఆసక్తికరమైన చిత్రాల్ని తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోను మొదలైంది. పైగా ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడ నటిస్తుండంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాలో తెలుగు యువ హీరో అల్లు శిరీష్ కూడ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. సూర్య పాత్రతో సమానమైన మరో పాత్రలో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. స్వతహగా సూర్యాకి వీరాభిమాని అయినా శిరీష్ తనకు ఈ పాత్ర దక్కడం పట్ల చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here