సాయిధ‌ర‌మ్‌తో గీతా ఆర్ట్స్‌

Actor Sai Dharam Tej Next with Geetha Arts, Hero Sai Dharam Tej Back To Geeta Arts, Latest Telugu Movies News, Sai Dharam in a Big Banner Again, Sai Dharam Tej and Geetha Arts Combo, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, సాయిధ‌ర‌మ్‌తో గీతా ఆర్ట్స్‌
Sai Dharam Tej and Geetha Arts Combo

ఏడాదికి క‌నీసం రెండు లేదా మూడు సినిమాలు చేస్తూ.. క‌థానాయ‌కుడిగా దూసుకుపోతున్నారు మెగా ఫ్యామిలీ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. ‘సుప్రీమ్’ త‌రువాత సాయిధ‌ర‌మ్‌కు ఆశించిన విజ‌యాలు లేక‌పోయినా.. అవ‌కాశాల విష‌యంలో మాత్రం ఇబ్బంది క‌ల‌గ‌డం లేదు. సాయిధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం ‘తేజ్ ఐ ల‌వ్ యు’ జూన్ 29న విడుద‌ల కానుండ‌గా.. త్వ‌ర‌లోనే కిషోర్ తిరుమ‌ల ‘చిత్ర‌ల‌హ‌రి’, గోపీచంద్ మ‌లినేని చిత్రాలు ప‌ట్టాలెక్క‌నున్నాయి. ఇదిలా ఉంటే.. మెగా క్యాంప్‌కి చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ‌లోనూ సాయిధ‌ర‌మ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘ఛ‌లో’తో విజ‌యాన్ని అందుకున్న వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదే సంస్థ శ‌ర్వానంద్‌, ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. ఒక‌వేళ ఆ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ కాక‌పోతే.. శ్రీ‌కాంత్ అడ్డాల కాంబినేష‌న్‌లో సాయిధ‌ర‌మ్ మూవీ సెట్ చేయాల‌ని గీతా ఆర్ట్స్ సంస్థ భావిస్తోందట‌. ద‌ర్శ‌కుడెవ‌రైనా.. సాయిధ‌ర‌మ్ తేజ్‌తో గీతా ఆర్ట్స్ మూవీ ప‌క్కా అన్న‌మాట‌. ఇంత‌కుముందు గీతా ఆర్ట్స్ – సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మంచి విజ‌యం సాధించిన నేప‌థ్యంలో.. ఈ సినిమా కూడా ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.

 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here