మళ్ళీ మొదలైన మల్టీస్టారర్ ట్రెండ్

Latest Telugu Film News, Multi Starrer Movies Trending Started Again, Multi Starrer Movies Trending Started Again In Telugu Film Industry, Multi Starrer Movies Trending Started Again In Tollywood, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Actors Multi Starrer Movies, Tollywood Movie Updates, మళ్ళీ మొదలైన మల్టీస్టారర్ ట్రెండ్

తెలుగులో మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ మళ్లీ మొదలైందా అనిపిస్తుంది నేటి ట్రెండ్ చూస్తుంటే …ఒకప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు చాలఎక్కువగా వచ్చేవి అనటానికి మహానటులు ఎన్టీ ఆర్ – ఏఏన్ ఆర్ ల కాంబినేషన్లో 14 చిత్రాలు రూపొందటాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ తరువాత అడపాదడపా తప్ప మల్టీస్టారర్స్ ఎక్కువగా రాలేదు.ఒక దశలో మల్టీస్టారర్స్ కు కాలం చెల్లింది అనుకునే పరిస్థితి కనిపించింది .కానీ ఈ మధ్య మరలా ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది .ఇప్పుడు తెలుగులో నాలుగు మల్టీస్టారర్స్ నిర్మాణంలో ఉండటమే అందుకు ఉదాహరణ . బాహుబలి సిరీస్ తరువాత సంచలన దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ -రాం చరణ్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేయడం సంచలనం సృష్టిoచ్చింది. డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.కాగా నాగార్జున-నాని ,వెంకటేష్-వరుణ్ తేజ్ , వెంకటేష్- నాగ చైతన్య కాంబినేషన్ లలో మూడు చిత్రాలు వివిధ దశలలో ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర్య సమర యోధుడు గా నటిస్తున్న ‘సైరా ‘ లో అల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి భారీ తారలు నటించడాన్ని కూడా మల్టీస్టారర్ ట్రెండ్ లో భాగం గానే చెప్పవచ్చు . అయితే కుడి ఎడంగా ఇద్దరు సమ వయస్కులు ,ఇద్దరు సమ ఉజ్జీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడితేనే అది మల్టీస్టారర్ అవుతుంది అనే నిర్వచనం ఒకటి ఉంది .ఆ నిర్వచనం ప్రకారం ఎన్టీఆర్-రాంచరణ్ ల కాంబినేషన్ మాత్రమే ట్రూ మల్టీస్టారర్ అవుతుంది .

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here