నటకిరీటికి కళానిధి అవార్డు బహుకరించిన మైసూరు ద‌త్త పీఠం

Dr Rajendra Prasad Conferred Kalanidhi Award Sri Ganapathi, Dr Rajendra Prasad Gets Kalanidhi Award, Latest Telugu Movies News, Nata Kireeti Dr Rajendra Prasad Conferred Kalanidhi Award, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, నటకిరీటికి కళానిధి అవార్డు బహుకరించిన మైసూరు ద‌త్త పీఠం

హాస్యానికి కిరిటాన్ని పెట్టిన న‌ట‌కిరీటికి డా.రాజేంద్ర ప్ర‌సాద్‌ కి క‌ళానిధి అవార్డుని అందించారు మైసూరు ద‌త్త పీఠంలోని స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి. ఈ అవార్డు ను స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి తన పుట్టిన రోజు సందర్భంగా బహుకరించడం జరిగింది. నాలుగు ద‌శాబ్దాలు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న న‌టుడు డా.రాజేంద్ర ప్ర‌సాద్‌.
అవార్డు బహుకరించిన అనంతరం గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి మాట్లాడుతూ … నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. హాస్యానికి కిరిటాన్ని పెట్టిన న‌ట‌కిరీటికి ఈ క‌ళానిధి అవార్డు ఇవ్వ‌డం ఆనందంగా ఉంది అన్నారు.
డా.రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ… ‘‘నాలుగు ద‌శాబ్ధాలుగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాను. న‌టుడిగా ఎన్నో అవార్డుల‌ను అందుకున్న‌ప్ప‌టికీ స‌ద్గురు గ‌ణ‌ప‌తి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా క‌ళానిధి అవార్డును స్వీక‌రించ‌డం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here