విజేత ఎప్పుడంటే..

విజేత ఎప్పుడంటే,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Vijetha Movie Updates,#Vijetha,Vijetha Telugu Movie Latest News,Vijetha Movie First Look,Kalyaan Dhev Vijetha Telugu Movie First Look,First Look Of Kalyaan Dhev From Vijetha Movie

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి మ‌రో యువ క‌థానాయ‌కుడు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఆయ‌నే.. చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ తొలి చిత్రం ‘విజేత‌’. మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని వారాహి చ‌ల‌న చిత్రం ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది. ఆ లుక్‌కు మెగాభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని జూలై నెల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. చిరు న‌టించిన హిట్ చిత్రం టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా కూడా అదే బాట‌లో వెళుతుందేమో చూడాలి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్న‌ ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతమందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here