నా పోస్టర్ల పై కలెక్షన్స్ వేయవద్దు :రామ్ చరణ్

నా పోస్టర్ల పై కలెక్షన్స్ వేయవద్దు రామ్ చరణ్,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Ram Charan About Collections,Ram Charan Latest News,Actor Ram Charan Upcoming Movie News,Hero Ram Charan Next Film News,Mega Powerstar Ram Charan About Collections

తమ అభిమాన హీరోలకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికి విపరీతంగా రియాక్ట్ అవుతుంటారు అభిమానులు. ముఖ్యంగా కలెక్షన్స్, రికార్డ్ లు,సెంటర్లు వంటి వాటిని చాలా ప్రిస్టేజ్ గా తీసుకుంటారు . వీటి విషయంలో మా హీరో గొప్ప అంటే ..మా హీరో గొప్ప అని కొట్లాడుకుంటూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోడమే కాకుండా ఆయా హీరోలను కూడా ఇబ్బంది పెట్టి ఎవరిని సమర్ధించలేని పరిస్థితిని క్రియేట్ చేస్తారు.

ఇలాంటి స్థితిలో కొందరు హీరోలు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తే కొందరు హీరోలు బోల్డ్ గా నిర్ణయలు తీసుకుంటారు. అలా ఒక బోల్డ్ డెసెషన్ తీసుకుని ఈ రోజు యంగ్ మెగాస్టార్ రామ్ చరణ్ అందరి అభినందనలు అందుకుంటున్నారు. ” ఇక మీదట నా సినిమా పోస్టర్ల మీద కలెక్షన్స్ వేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాను .ఆ మేరకు నా నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తాను. అలా కలెక్షన్స్ వేయడం అభిమానుల మధ్యనే కాకుండా ఇతరత్రా కూడా చాలా అవాంఛనీయ విషయాలకు అవకాశం ఇస్తుంది . అందుకే ఇక మీదట నా సినిమా పోస్టర్ల మీద కలెక్షన్స్, రికార్డులు వంటివి రాకుండా చూసుకుంటాను ..అని ప్రకటించారు రామ్ చరణ్. రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆయన అభిమానులనే కాకుండా అందరు హీరోల అభిమానులను ఆలోచింపజేస్తుందని ఆశిద్దాం .

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here