సెకండాఫ్ కీర్తి సురేష్ హ‌వా

సెకండాఫ్ కీర్తి సురేష్ హ‌వా,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Keerthy Suresh Upcoming Movies,Actress Keerthy Suresh Latest News,Heroine Keerthy Suresh Next Film Updates,Keerthy Suresh Next Movies List

‘నేను శైల‌జ’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక కీర్తి సురేష్‌. ఆ త‌రువాత ‘నేను లోక‌ల్’తో మ‌రో విజ‌యాన్ని అందుకున్నా.. ‘అజ్ఞాత‌వాసి’ ఫ‌లితం ఆమెను నిరాశ‌ప‌రిచింది. అయితే తాజాగా విడుద‌లైన ‘మ‌హాన‌టి’ చిత్రం కీర్తికి న‌టిగా మంచి గుర్తింపును తీసుకువ‌చ్చింది. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో.. సావిత్రిగా కీర్తి చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఈ సినిమా సాధించిన ఘ‌న‌విజ‌యంతో.. త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది కీర్తి. ఇదిలా ఉంటే.. త‌మిళ‌నాట ఈ ఏడాది ద్వితీయార్థం అంతా కీర్తి సురేష్ సంద‌డే క‌నిపించ‌నుంది. కీర్తి క‌థానాయిక‌గా న‌టిస్తున్న మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ సెకండాఫ్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. విక్ర‌మ్‌కు జోడీగా కీర్తి న‌టిస్తున్న ‘సామి స్క్వేర్‌’, విజ‌య్ – మురుగ‌దాస్‌ల హ్యాట్రిక్ మూవీ, విశాల్ ‘సండైకోళి 2’ (‘పందెం కోడి’ సీక్వెల్‌) చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్నాయి. వీటిలో ఏ రెండు చిత్రాలు విజ‌యం సాధించినా.. త‌మిళ‌నాట కీర్తి హ‌వా మాములుగా ఉండ‌దు అంటున్నారు త‌మిళ తంబిలు. కాగా.. ఈ మూడు సినిమాలూ తెలుగులోనూ అనువాదం కానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here