ఆది పినిశెట్టి – తాప్సిల సినిమా టైటిల్‌ను ప్రకటించిన నాని

ఆది పినిశెట్టి తాప్సిల సినిమా టైటిల్‌ను ప్రకటించిన నాని,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Nani Unveiling Kona Venkat Film Title Neevevaro,Neevevaro Movie Updates,Neevevaro Telugu Movie Latest News,Nani to unveil title of upcoming Aadhi Pinisetty & Taapsee Starrer,Nani to announce the title of Aadhi Pinisetty Next

నేచుర‌ల్ స్టార్ నాని, ఆది పినిశెట్టి, నివేథా థామ‌స్ న‌టించిన చిత్రం ‘నిన్ను కోరి‘. ఈ సినిమా కోన ఫిల్మ్ కార్పొరేషన్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ కోన వెంకట్‌ ఆది పినిశెట్టితో కలిసి మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘లవర్స్‌’ ఫేమ్‌ హరి దర్శత్వంలో రచయిత కోన వెంకట్‌ తన కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పై ఎమ్ వీవీ సినిమాస్ వారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తుంటే.. తాప్సీ, రితికా సింగ్ కథానాయికలుగా కనిపించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్‌ క్యారెక్టర్‌.. ఏదైనా సరే తన నటనతో ఆకట్టుకునే ఆది పినిశెట్టి ఈ సినిమాలో అంధుడిగా నటిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు టైటిల్ ఈ రోజు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు నేచుర‌ల్ స్టార్ నాని ఎనౌన్స్ చేసారు. కాస్త థ్రిల్లర్ టచ్ వున్న ఈ సినిమాకు ‘నీవెవరో‘ అనే టైటిల్ ను హీరో నాని ఎనౌన్స్మెంట్ చేసారు. టైటిల్ ఆసక్తికరంగానే వుంది. కాంబినేషన్ కూడా సూపర్బ్ . ఈ మద్య ఆది పినిశెట్టి కూడా ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు. కొంతకాలంగా తెలుగులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వస్తోన్న ఆది పినిశెట్టి, ఈ సినిమాతో మళ్లీ హీరోగా ఆడియన్స్‌ను పలకరించనుండటం విశేషం. మ‌రీ ఆది పినిశెట్టికి ఈ సినిమా హీరోగా మంచి విజ‌యాన్ని అందిస్తుందో లేదో అనేది వేచి చూడాలి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here