టాలీవుడ్ మ‌న్మ‌థుడుకి 32 ఏళ్ళు

టాలీవుడ్ మ‌న్మ‌థుడుకి 32 ఏళ్ళు,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Nagarjuna Still From 32nd Movie,Akkineni Nagarjuna New Movie,Akkineni Nagarjuna Upcoming Movie News,Akkineni Nagarjuna Next Film Updates,Akkineni Nagarjuna Latest Still From Next Movie

అక్కినేని నాగార్జున‌.. తెలుగు తెర మ‌న్మథుడు. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. గ్లామ‌ర్‌, స్టైల్ ఐకాన్‌. కొత్త ద‌ర్శ‌కుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ప్ర‌యోగాల‌కు చిరునామా. ఇలా.. చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో. మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట‌వార‌సుడిగా తెరంగేట్రం చేసినా.. అన‌తి కాలంలోనే క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగ్‌. క్లాస్‌, మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను త‌న అభిన‌యంతో అల‌రించారు. అలాగే.. కేవ‌లం తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ్‌, హిందీ చిత్రాలు చేసి ఇత‌ర భాషా ప్రేక్ష‌కుల‌ను కూడా మురిపించారు. అలాంటి నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ తొలి చిత్రం ‘విక్ర‌మ్‌’. సీనియ‌ర్ ద‌ర్శ‌కులు వి.మ‌ధుసూధ‌న‌రావు రూపొందించిన ఈ చిత్రంలో శోభ‌న క‌థానాయిక‌గా న‌టించింది. హిందీలో విజ‌య‌వంత‌మైన హీరో చిత్రం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా.. స‌రిగ్గా 32 ఏళ్ళ క్రితం ఇదే రోజున (మే 23, 1986) విడుద‌లైంది. అంటే.. నాగార్జున న‌ట ప్ర‌స్థానానికి ఈ రోజుతో 32 ఏళ్ళు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌. విశేష‌మేమిటంటే.. త‌న తొలి చిత్రం విడుద‌లైన తేదినే.. త‌న తండ్రి నాగేశ్వ‌ర‌రావు న‌టించిన‌ ఆఖ‌రి చిత్రం ‘మ‌నం’ (2014) కూడా విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. ‘మ‌జ్ను, ఆఖ‌రి పోరాటం, గీతాంజ‌లి, శివ‌, అల్లరి అల్లుడు, హ‌లో బ్ర‌ద‌ర్‌, నిన్నే పెళ్ళాడ‌తా, అన్న‌మ‌య్య‌, నువ్వు వ‌స్తావ‌ని, సంతోషం, మ‌న్మ‌థుడు, నేనున్నాను, మాస్‌, శ్రీ‌రామ‌దాసు, మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి’ లాంటి ఎన్నో విజ‌యంత‌మైన చిత్రాల‌తో అల‌రించిన నాగ్‌.. మున్ముందు మ‌రిన్ని విజ‌యాల‌ను అందుకోవాల‌ని ద‌ తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్ ఆకాంక్షిస్తోంది.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here