‘మహానటి’ కి తెలుగు ఫిలింనగర్ డాట్ కామ్ అక్షరాభినందన

Latest Telugu Movies News, Mahanati Movie Updates, Mahanati Telugu Movie Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Telugu Filmnagar Tribute to Mahanati, Telugu Filmnagar Tribute to Mahanati Movie, Telugu Filmnagar Tribute to Mahanati Telugu Movie, Tollywood Movie Updates, మహానటి కి తెలుగు ఫిలింనగర్ డాట్ కామ్ అక్షరాభినందన

దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ అనే సినిమా నిర్మాణం జరుపుకుంటుందని విన్నపుడు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు … కాని సినిమా చూసాక ఇది ఆ మహానటికి దక్కిన నిజమైన ఘనమైన నివాళి అనిపించింది. ఈ అరుదైన ప్రయత్నాన్ని అభినందిస్తూ వ్యాస రూపంలో సమీక్ష రాసినప్పటికీ అది చాలదు అనిపించి ఆ ఆహ్లాదకర విజయానందానికి ఇలా అక్షర రూపాన్నిచ్చింది తెలుగు ఫిలింనగర్ డాట్ కామ్.

కంటి చూపు ఒకటి చాలు
కొంటె నవ్వే వేలవేలు 
పెదవి విరుపు 
నొసటి మెరుపు 

అణువణువున అభినయమే 
హావభావ రసమయమే 
సాటి ఎవరు సావిత్రికి 
ఇలయందున ఇంద్ర సభయందున 

తరతరాలు చెప్పుకునే 
నటవైభవ చిహ్నం 
తెలుగు వాడి చేజారిన 
వెల తెలియని వజ్రం 

సావిత్రి స్మృతులన్నీ 
ప్రతి యెదలో పదిలం
ఆ మహానటికి ఘననివాళి
ఈ ‘మహానటి’ చిత్రం

ప్రతి పాత్రను సజీవంగా 
మలిచినట్టి తీరు 
చరిత్రలోన నిలిచిపోవు 
నాగాశ్విన్ పేరు 

ఆలోచనే అమోఘం 
ఆ చరణిక అద్భుతం 
తెలుగు తెరకు బయోపిక్ 
ప్రయోగాల పరిచయం 

వైభవాన్ని ప్రాభవాన్ని 
విలాసాన్ని విలాపాన్ని 
విషాదాన్ని వియోగాన్ని 
పతనమైన విధానాన్ని 

చూపించిన చాతుర్యం 
పాటించిన సమతుల్యం 
ఆద్యంతం ఆహ్లాదం 
అయ్యారే ఆశ్చర్యం 

కీర్తి శేషగా నిలిచిన
సావిత్రి పాత్రలో
జీవించిన కీర్తి సురేష్
సాధించను ఘనకీర్తి 

అతివలంటే అబలలనే 
అపకీర్తిని అధిగమించి 
స్వప్నా ప్రియాంకాలు 
సాధించిన ఘనవిజయం 

సంగీతం సాహిత్యం
సాంకేతిక ప్రావీణ్యం
కలగలిసిన క్లాసిక్ ఇది
కళాఖండ లక్షణమిది

చెప్పకుండ ఉండలేము 
‘ సావిత్రికి ‘ జోహార్లు 
చెప్పే తీరాలి ఇంక
‘ మహానటి ‘ కి జేజేలు 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here