రాజేంద్ర ప్రసాద్‌కు న్యూజెర్సీ ప్రభుత్వం అరుదైన గుర్తింపు

Actor Rajendra Prasad honoured with Lifetime Achievement Award by New Jersey General Assembly, Latest Telugu Movies News, Rajendra Prasad felicitated on being honoured with Life time achievement award by America Government, Rajendra Prasad Honoured with Life Time Achievement Award, Telugu actor Dr. Rajendra Prasad honored with Lifetime Achievement Award in New Jersey, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, రాజేంద్ర ప్రసాద్‌కు న్యూజెర్సీ ప్రభుత్వం అరుదైన గుర్తింపు

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెచ్చిపెట్టాయి. రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( MAA ) అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.
హాస్య నటుడిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోవడమే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈ తరాన్ని సైతం మెప్పిస్తున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. సినీ జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్న నటకిరీటికి న్యూజెర్సీ ప్రభుత్వం అరుదైన కానుక ప్రకటించింది. న్యూజెర్సీ ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో స్ట్రెస్ రిలీఫ్ ఆర్టిస్టుగా రాజేంద్ర ప్రసాద్ ఎంపికయ్యారు.

రాజేంద్ర ప్రసాద్ తన 41 ఏళ్ల సినీ ప్రస్థానంలో 237 సినిమాల్లో నటించారు. ఇటీవల న్యూజెర్సీలోని జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్‌కు ‘సెనేట్ లైఫ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో రాజేంద్ర ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహరావు, నాగ్ అశ్విన్, సతీష్ వేగేశన్, కాదంబరి కిరణ్, అనిల్ రావిపూడి, నందినీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ…. “న‌టుడిగా 41 ఏళ్లు వివిధ పాత్ర‌ల్లో రాణిస్తున్నానంటే కార‌ణం నా ద‌ర్శ‌క నిర్మాత‌లు. న‌న్ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులే. కొత్తత‌రం ద‌ర్శ‌కులు న‌న్ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు కాబ‌ట్టి ఈ వ‌య‌సులో కూడా నేను కొత్త పాత్ర‌ల‌తో మెప్పించ‌గ‌లుగుతున్నాను. ఈ జ‌ర్నీలో ఎన్నో అవార్డులు అందుకున్నా. యు.ఎస్‌.లోని న్యూ జెర్సీ గ‌వ‌ర్న‌మెంట్ నుంచి అవార్డు అందుకోవడం ప్ర‌త్యేకం అని ఎందుకు అంటున్నానంటే…. న్యూజెర్సీలో తెలుగు ప్రేక్ష‌కులే కార‌ణం. అక్క‌డి రాజ‌కీయ నాయ‌కులు ఓట్లు కోసం వెళ్లినప్పుడు వారు నా గురించి నా సినిమాల గురించి గొప్ప‌గా చెప్ప‌డం వ‌ల్ల‌నే న్యూజెర్సీ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ, సెనేట్ నాకు స్ట్రెస్ రిలీవ‌ర్‌గా గుర్తించి నాకు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును బ‌హూకరించారు. ఈ అవార్డును తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అంకితం చేస్తున్నాను.
తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో అన్ని చోట్ల ఉన్న‌ట్లే మంచి, చెడు రెండూ ఉన్నాయి. అంద‌రూ చెడు వైపు కాకుండా మంచి వైపు చూడండి. చెడు కంటే మంచే ఇక్క‌డ ఎక్కువ‌గా ఉంది. అందువ‌ల్ల‌నే మేం ప్రేక్ష‌కుల‌ను ఎంటర్‌టైన్ చేయ‌గ‌లుగుతున్నాం’’ అన్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here