“ ఆకాష్ పూరీని హీరోగా నిలబెట్టిన ”మోహబూబా ”

ఆకాష్ పూరీని హీరోగా నిలబెట్టిన మోహబూబా,Mehbooba Movie Review,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Mehbooba Review,Mehbooba Telugu Movie Review & Rating,Mehbooba Movie Public Talk,Mehbooba Telugu Movie Public Response,Mehbooba Movie Story,Mehbooba Telugu Movie Live Updates

తమ కొడుకులను హీరోలుగా పరిచయం చేసి నిలబెట్టడంలో మన అగ్రశ్రేణి దర్శకులు చాలా మంది విఫలమయ్యారు .ఎందరెందరో కొత్తవాళ్లకు అవకాశాలు ఇచ్చి హీరోలుగా కొత్త జీవితాలను ప్రసాదించిన టాప్ డైరెక్టర్స్ తమ కుమారులను మాత్రం ఆ స్థాయిలో ప్రెజెంట్ చేయలేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తరం సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏక్షన్ హీరోగా ప్రెసెంట్ చేస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన “మెహబూబా “ఈ రోజు విడుదలైంది .దర్శకుడిగా తన మేకింగ్ ఫ్రీడంకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఎదురవ్వకూడదనే నిర్మాతగా మారిన పూరీ”మెహబూబా “ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు .తన కుమారుడు హీరో అనే దృష్టితో కాకుండా సబ్జెక్టు డిమాండ్ ప్రకారం ఒక కొత్త కుర్రాడి మీద ఇంత భారీ ఏక్షన్ సినిమా తియ్యడం సాహసమే అవుతుంది .మేకింగ్ స్టాన్దర్డ్స్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా “పూరీ కాన్సెప్ట్స్ “పతాకంపై పూరీ నిర్మించిన ”మెహబూబా ”ఎలా ఉందొ చూద్దాం .

కథగా చెప్పాలంటే ఇది పునర్జన్మ ,ప్రేమ ,దేశభక్తి అనే మూడు అంశాల నేపథ్యంలో అల్లుకున్న మిక్స్డ్ జోనర్ కథ .గత జన్మ స్మృతులు వెంటాడుతున్న హీరో,హీరోయిన్లు ఈ జన్మలో ఎప్పడు ,ఎలా ,ఏ పరిస్థితులలో కలుసుకున్నారు అనే పాయింట్ ను చాలా ఇంటరెస్టింగ్ గా నర్రెట్ చేసాడు పూరీ .మిలిటరీ నేపధ్యం అనగానే ఇండో -పాక్ వార్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని ,ఇరు దేశాల సైన్యాల మధ్య ,పౌరుల మధ్య నెలకొన్న శత్రు భావనకు సంబందించిన సన్నివేశాలు ,సంభాషణలు రేజర్ఎడ్జిలో ఉంటాయనేఅంచనాలు ఉంటాయి .ఆ అంచనాలకు తగ్గట్టుగానే పూరీ ఇండో -పాక్ రిలేషన్స్ మీద పదునైన డైలాగ్స్ రాసి చప్పట్లు కొట్టించాడు .పునర్జన్మ అనే కాన్సెప్టును నమ్మితే మాత్రం నిజంగానే ఇదొక వెల్ సెడ్ స్టోరీగా అభినందించవచ్చు .ఇక వైవిధ్యంగల ఈ కథను పూరీ తెరకెక్కించిన తీరు మాత్రం సింప్లీ  సూపర్బ్ .డైలాగ్స్ ,మేకింగ్ వాల్యూస్ ,కాస్టింగ్ సెలక్షన్ వంటి విషయాలలో పూరీ మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది .

ఇక హీరోగా ఆకాష్ పూరీ అప్పియరెన్స్ ,పరఫార్మన్స్ చాలా చాలా బాగున్నాయి.ప్రేమ -దేశభక్తి అనే రెండు డిఫరెంట్ ఎమోషన్స్  ఉన్నరెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఆకాష్ చాలా మంచి వేరియేషన్స్ చూపించాడు .పూరీ కొడుకుగా పరిచయం అయినా త్వరలోనే ఆకాష్ తనకంటూ ఒక సెపరేట్ రేంజిని ,మార్కెట్టును క్రియేట్ చేసుకుంటాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు . ఒక జన్మలో హిందువుగా ,మరో జన్మలో ముస్లింగా పుట్టి రెండింటిలోనూ మంచి వైవిధ్యాన్ని చూపించిన నేహా శెట్టి యూత్ కు బాగా కనెక్ట్ అయింది .ఇక షియాజీ షిండే ,మురళి శర్మ ల తండ్రి పాత్రలు వాళ్లకుకొట్టిన పిండి .ఇక టెక్నికల్ గా కెమెరా ,ఆర్ట్ ,ఎడిటింగ్ ,మ్యూజిక్ వంటి అన్ని డిపార్ట్మెంట్స్ అప్ టు ది మార్క్ అనిపించాయి .

ఓవర్ ఆల్ గా సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ గా ఫీల్ అవ్వటం గాని ,డ్రాపింగ్ గా కానీ అనిపించదు .కానీ సెకండ్ హాఫ్ లో కొంత భాగం రొటీన్ అండ్ రిపీటెడ్ గా ఉండటంతో ఫ్రెష్ నెస్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది .మొత్తం మీద ”మెహబూబా”ను ఒక డిఫరెంట్ ఏక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పెట్రియాటిక్ లవ్ స్టోరీగా ,వన్ టైం వాచ్ వర్ధి గా అభినందించవచ్చు . ఫైనల్లీ మెహబూబా పూరి జగన్నాధ్ కు మంచి ”సన్ షైన్ ”ఇస్తుందే తప్ప ”సన్ స్ట్రోక్ ”కాదని చెప్పవచ్చు .

హైలైట్స్ ;

*డిఫరెంట్ బ్యాక్ డ్రాప్

*ఆకాష్ పూరీ అప్పీరెన్స్ అండ్ పెరఫార్మెన్సు

*మేకింగ్ హైట్స్*పూరీ మార్క్ ఆఫ్ డైలాగ్స్

*సందీప్ చౌతా  మ్యూజిక్ .

వన్ అండ్ ఓన్లీ మైనస్ ;  సెకండ్ హాఫ్ లో చిన్న డ్రాపింగ్ .

ఓవర్ ఆల్ గా ”తెలుగు ఫిలిం నగర్ డాట్ కామ్ ” రేటింగ్  3 / 5

.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here