బిజీ గా మారుతున్న మిల్కీ బ్యూటీ

బిజీ గా మారుతున్న మిల్కీ బ్యూటీ,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Tamannah Becomes A Busy Heroine,Actress Tamannaah Bhatia Latest News,Heroine Tamannaah Bhatia Upcoming Movies,Tamannaah Bhatia Becomes A Busy Heroine
మిల్కీ బ్యూటీ తమన్నా ” శ్రీ “సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.తమన్నా నటించిన హ్యాపీ డేస్,100%లవ్,రచ్చ,బాహుబలి,ఊపిరి వంటి సినిమాలు సూపర్ సక్సెసయ్యాయి. తెలుగు,తమిళ్, సినిమాలలో నటిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తెలుగులో బిజీగా ఉన్నారు. కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్ పై జయేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన నా నువ్వే సినిమా మే 25వ తేదీ రిలీజ్ కానుంది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో హీరోయిన్ గా తమన్నానటించింది.

 

బాహుబలి సినిమాలో పోరాట సన్నివేశాలలో అద్భుతం గా నటించిన తమన్నా,కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్,భారీ తారాగణం తో రూపొందుతున్న సైరా సినిమాలో నరసింహా రెడ్డి తరఫున శత్రువుల పై పోరాడే వీరనారి గా నటిస్తున్నారు.

 

వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ F2 లో కథానాయికగా తమన్నానటిస్తున్నారు. పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న తమన్నా శ్రీదేవి బయోపిక్ మూవీ లో గానీ,టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్ మూవీ లో గానీ నటించాలని ఉందని తన మనసు లోని కోరికను వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here