నేల టిక్కెట్ ఆడియో రిలీజ్ వేడుక హైలెట్స్

Latest Telugu Movies News, Mass Maharaja Ravi Teja Nela Ticket Audio Launch Highlights, Nela Ticket Movie Audio Launch Highlights, Nela Ticket Movie Updates, Nela Ticket Telugu Movie Audio Launch Highlights, Nela Ticket Telugu Movie Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, నేల టిక్కెట్ ఆడియో రిలీజ్ వేడుక హైలెట్స్
ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన నేలటిక్కెట్ సినిమా ఆడియో రిలీజ్  హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో 10వ తేదీ   గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక కు జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా పాల్గొని బిగ్ సీడీ రిలీజ్ చేశారు.
ఇప్పుడు సినీ ఇండస్ట్రీ లో ఒక కొత్త సంప్రదాయం మొదలయింది. ఒక హీరో సినిమా ఫంక్షన్ కు మరో హీరో ముఖ్య అతిధి గా పాల్గొనడంతో ఇద్దరి హీరోల అభిమానులతో,ప్రేక్షకులతో ఆ ఫంక్షన్ కళ కళ లాడుతూ గ్రాండ్ లుక్ తో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ లోని హీరోలందరూ స్నేహభావం తోఉన్నట్టుగానే,అభిమానులు కూడా స్నేహభావం తో ఉండాలని ప్రేక్షకుల కోరిక. నేల టికెట్ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ AV ని చిత్ర యూనిట్ ప్రదర్శించారు. ఈ AV ని పవన్ కళ్యాణ్ బాల్యం నుండి హీరో గా,రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరును,మధ్యలో పవన్ కళ్యాణ్ సాంగ్స్,బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ తో తీర్చిదిద్దారు.
తన AV ని తిలకించిన పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు. హీరో రవితేజ నవ్వులు,పెర్ఫార్మెన్స్ వెనుక చాలా తపన,కష్టం,కృషి ఉన్నాయని,ఒక వ్యక్తి ఇలా హాస్యం పండిస్తున్నారంటే గుండెల్లో ఎంతో కొంత బాధ,ఆవేదన లేకపోతే హాస్యం రాదని,అందుకే తనకు రవితేజ అంటే ఇష్టం,గౌరవం అన్నారు. ఎక్కడా ఆత్మ విశ్వాసం సన్నగిల్లకుండా,అన్నింటికీ తట్టుకుని నిలబడి రవితేజ ఈ స్థాయి లో ఉండటం ఆనందంగా ఉందని,ఈ సినిమా ఘన విజయం సాధించాలని పవన్ అన్నారు.
హీరో రవి తేజ మాట్లాడుతూ .. పదేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ ఫోన్ లో నాతో మాట్లాడుతూ మీరు సిగ్గు లేకుండా ఎలా నటిస్తారండి అని అడిగారు. అది తనకు వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంటని,ఎప్పటికి మరిచిపోనని,తనకు పవన్ కళ్యాణ్ ఇష్టమయిన వ్యక్తి అని ఓపెన్ గా,హానెస్ట్ గా ఉంటారన్నారు.
సోగ్గాడే చిన్ని నాయన,రారండోయ్ వేడుక చూద్దాం వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ,తన కామెడీ టైమింగ్,డాన్స్,ఫైట్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో రూపొందిన నేల టిక్కెట్ సినిమాకు విజయం తథ్యం. ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు హేట్రిక్ హిట్ మూవీ కావాలని కోరుకుందాం .
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here